కోరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా శ్రీమంతుడు. ఆగడు ప్లాప్ తర్వాత మహేష్ బాబు చాలెంజింగ్ తీసుకొని నటిస్తున్న సినిమా ఇది. టైటిల్ పరంగా చూస్తే ఈ సినిమా సెంటిమెంట్ తో కూడుకున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. అంతే కాదు మహేష్ బాబు అంటే యాక్షన్ సీన్లకు కొదవ ఉండదు. ఇక ఈ సినిమాలోని ఓ పాట మహేష్ బాబును మరదలు ఆట పట్టించే పాట అట. ఈ మరదలి పాత్రలో వర్ధమాన నటి కారుణ్య చౌదరి నటించింది. 


శ్రీమంతుడు షూటింగ్ స్పాట్ లో మహేష్ బాబు, శ్రుతి హాసన్


పాటను చిత్రీకరిస్తున్నప్పుడు ఎవరో సెల్ ఫోన్ ద్వారా కొంచెం పాటను చిత్రీకరించి ఈ వీడియోను లీక్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇలా వీడియో లీక్ అవ్వడం పట్ల చిత్రం యూనిట్ చాలా టెన్షన్ పడుతోందట. ఈ వీడియో లీకైన వెంటనే, ఇకపై ఇలాంటి లీకేజ్ లు జరగకూడదని చిత్రం యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారమ్. మరి ఈ వీడియోను లీక్ చేసి ఈ చిత్రం యూనిట్ ని టెన్షన్ లో పడేసింది ఎవరో. ఇదిలా ఉంటే లీకైన వీడియోలోని ఆ పాట బిట్ మాత్రం అదిరిపోయిందట.  ఈ మధ్య సినిమా షూటింగ్ లు పాటల రికార్డింగ్ వీడియోలు లీక్ కావడం అవి సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేయడం దీంతో అభిమానులు దానిపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ కామన్ అయిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే ఆ వీడియోని బ్లాక్ చేయించినట్లు తెలిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: