ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లు దర్శకత్వం రూట్ వైపు మళ్లుతున్న విషయం తెలసిందే. ఈ కోవలోకే వస్తున్నాడు ప్ర స్తుతం చిత్రసీమలో తిరుగులేని ఫైట్ మాస్టర్స్ గా కొనసాగతున్నవాళ్లల్లో పీటర్ హెయిన్స్ ది అగ్ర స్థానమే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్స్ అంటే పీటర్ హెయిన్స్ ని తీసుకుంటారు.


త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఫైటింగ్ సీన్ ఎడిటింగ్ చేయిస్తున్ పీటర్ హెయిన్స్


మగదీర లో మనోడి ఫైటింగ్ కొరియోగ్ర ఫి ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు.   పీటర్ హెయిన్స్ ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తున్న చిత్రాల్లో భారీ చిత్రం ‘బాహుబలి’ ఉంది. ఈ చిత్రం రెండు భాగాలకు తనే ఫైట్ మాస్టర్. ఫైట్ మాస్టర్ గా ఫుల్ బిజీగా ఉన్న పీటర్ హెయిన్స్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు. బేసిక్ గా తను ఫైట్ మాస్టర్ కాబట్టి, ఓ మంచి యాక్షన్ మూవీకి డైరెక్షన్ చేస్తాడని ఊహించవచ్చు. కానీ, ఈ చిత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.


రోబో సినిమాలో రజినీకాంత్ కు సూచనలు ఇస్తున్న పీటర్ హెయిన్స్


ఇక మనోడు దర్శకత్వానికి సంబంధించిన శిక్షణ కూడా తీసకున్నాడట. ఇంకా ఏవైనా సలహాలు సూచనలు కావాలంటే ఉండనే ఉన్నాడు కదా మన జక్కన్న. పీటర్ హెయిన్స్ దర్శకత్వం వహించనున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. చక్కని కుటుంబ అనుబంధ్యాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. కథ కూడా పూర్తయ్యిందట.  పకడ్బందీ ప్రణాళికతో ఈ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నాడు. వియత్నామ్ భాషలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు


మరింత సమాచారం తెలుసుకోండి: