రేణు దేశాయ్ తాను  ప్రేమలో పడ్డాను అంటూ తన ట్విటర్ లో  పెట్టిన ట్విట్ ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ని చూస్తూ పవన్ అభిమానులు బిజీగా ఉన్నా మధ్యలో ఊడి పడ్డ ఈ ట్విట్ ను చూసి పవన్ అభిమానులు కొద్దిగా షాక్ అయ్యారు. 


నేను ఒకర్ని ప్రేమిస్తున్నాను


‘నేను ఇచ్చిన మాట తప్పాను, నేను ఎవర్ని ప్రేమించనని గతంలో నీకు చెప్పాను. కానీ ఇప్పుడు నేను ఒకర్ని ప్రేమిస్తున్నాను అది ఎవరో కాదు నాకు నేనే’ అంటూ భావయుక్తంగా రేణు దేశాయ్ పెట్టిన  ట్విట్ పవన్ టార్గెట్ చేస్తున్నట్లుగా స్పష్టంగా ఎవరికైనా అర్ధం అవుతుంది.


రేణు పవన్ టార్గెట్ చేస్తున్నట్లుగా

నిన్నటి  దాకా అనేక సందర్భాలలో తన ట్విటర్ లో పవన్ నామస్మరణ చేసిన రేణు మళ్ళీ యూటర్న్ తీసుకుని తాను మాట తప్పాను అని అనడమే కాకుండా అందరి కంటే ఎక్కువగా ప్రస్తుతం తనని తాను ప్రేమించు కుంటున్నాను అని అనడం బట్టి మళ్ళీ రేణు దేశాయ్ కు ఎదో ఒక విషయంలో అనుకోని షాక్ తగిలి నిరాశలో ఉంది అన్న అర్ధాన్ని కలిగిస్తోంది.


అనుకోని షాక్ తగిలి నిరాశలో ఉంది


ఈ వారంలోనే తన కూతురు  ఆద్య పుట్టినరోజు తాను కోరుకున్న  విధంగా చేసిన రేణు దేశాయ్ కి ఇప్పుడు ఈ అనుకోని వేదాంతం వెనుక ఉన్న  అర్ధం ఏమిటో రానున్న రోజులలో తెలిసే  అవకాశం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: