టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ రుద్రమదేవి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర కథనం టాలీవుడ్ లో ప్రచారం జరగుతుంది. వివరాల్లోకి వెళితే, ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి' మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.

ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్స్ ఎప్పుడు అనేది మాత్రం ఒక్క గుణశేఖర్కి మాత్రమే తెలుసు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూసుకుంటే, ఈ సినిమా త్వరలో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. ఎందుకంటే మూవీకి సంబంధించిన పెండింగ్ వర్క్ చాలా ఉన్నాయి. థియోట్రికల్ ట్రైలర్ వచ్చిన తరువాత గ్రాఫిక్స్ లో క్యాలిటి లోపించందనే టాక్స్ వినిపించాయి.

దీంతో మరోసారి గ్రాఫిక్స్ ని క్యాలిటితో కొద్దిపాటి మార్పులు చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నాడట. అలాగే ఈ మూవీకి బ్యాగ్రౌండ్ స్కోరు అందిస్తున్న ఇళయారాజ ఇంకా పని పూర్తి చేయలేదట. ఫారిన్ కి వెళ్ళిన విజువల్ ఓఫెక్టు వర్క్ కూడా పెండింగ్ లో ఉంది. మరో వైపు మే నెలలో ‘బాహుబలి' రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటంతో, ఎట్టిపరిస్థితుల్లో, బాహుబలి కంటే ముందుగానే ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ప్రాక్టికల్ గా అది సాధ్యపడే విధంగా కనిపించడం లేదని చిత్రవర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకు హైలెట్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: