సంచలనాల దర్శకుడిగా పేరు పడ్డ రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది వెరైటీగా ఉంటుంది కదా.. అవును రామ్ గోపాల్ వర్మ, రాజశేఖర్ కాంబినేషన్ లో చిత్రం అనగానే  అందరూ ఆశ్చర్య పోయారు. అందులోనూ హర్రర్ అనగానే పెద్ద హర్రర్ సినిమా అనగా అబ్బే ఇది కామనే అనుకున్నారు. ‘ పట్టపగలు’ టైటిల్ రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్ ...తండ్రి పాత్రలో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్స్ వదిలారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే చిత్రం ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రానికి రాజశేఖర్ నిర్మాత.

హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురున్న తండ్రిగా రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లోనే ఆయన నటిస్తున్నారు. ‘బ్రేకప్'లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తోంది.


పట్టపగలు సినిమా షూటింగ్ లో భాగంగా రాజశేఖర్ కి సూచనలు ఇస్తున్నరాంగోపాల్ వర్మ



అయితే ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించిన ట్రయిలర్ విడుదల చేశారు. సోషల్ నెట్ వర్కు లో కాని అది అందగా ఆకర్శించలేదు.అయితే పట్టపగలు చిత్రంలో కొన్ని సన్నివేశాలు...జీవిత,రాజశేఖర్ లకు నచ్చలేదని, ముఖ్యంగా క్లైమాక్స్ మార్చమని వర్మని అడిగారని చెప్పుకుంటున్నారు. అయితే మొదట అలాగే మారుద్దామని మాట ఇచ్చిన వర్మ తర్వాత దాని ప్రసక్తే తేకుండా తను కంటిన్యూగా ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపద్యంలో ఆ సీన్స్ మార్చకుండా రిలీజ్ చెయ్యలేరు. వర్మ వాటిని రీషూట్ చెయ్యటం లేదు. దాంతో ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం పెట్టుబడి బ్లాక్ అయ్యిపోయినట్లుంది. ఇంతకీ వర్మ రాజశేఖర్ కోరిక తీరుస్తాడు అలాగే తీసి దీన్నికూడా ప్లాపు జమలో కడతాడా వేచి చూడాల్సిందే...


మరింత సమాచారం తెలుసుకోండి: