కోలీవుడ్ టాప్ హీరో సూర్యాకు తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి  క్రేజ్ ఉంది. ఇతడి సినిమాలకు టాలీవుడ్ లో కూడా మంచి  మార్కెట్  ఉంది. కమల్ రజినీకాంత్ ల తరువాత తెలుగు ప్రేక్షకులలో సుర్యాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే గత కొద్ది కాలంగా కోలీవుడ్ లో సూర్యా సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో తన అదృష్టాన్ని తెలుగులో ఒక డైరెక్ట్ సినిమా చేయడం  ద్వారా పరీక్షించు కోవాలని సూర్య నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 


ఇక ఈ వార్తలకు మరో లేటెస్ట్ ట్విస్ట్


ఈ ప్రయత్నంలో భాగంగానే సూర్య గతంలో పూరి జగన్నాథ్, వినాయక్ లు చెప్పిన కథలు విన్నప్పటికీ  ఆ కథలు సుర్యాకు నచ్చలేదు అనే వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలకు మరో లేటెస్ట్ ట్విస్ట్ ఇస్తూ సూర్యా తెలుగులో స్వయంగా నటిస్తూ నిర్మించబోయే సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విడుదల తరువాత త్రివిక్రమ్  చేయబోయే  సినిమా ఇదే అంటూ ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.  

సూర్య త్రివిక్రమ్ కు ఆఫర్ చేసాడు


ఇప్పటికే  సూర్యా త్రివిక్రమ్ లు  ఈ విషయం పై పరస్పరం చర్చించు కున్నారని ఒక మంచి కథతో కూడిన సినిమాను తనకు చేసిపెడితే 15 కోట్లు పారితోషి కాన్ని ఇస్తానని సూర్య త్రివిక్రమ్ కు ఆఫర్ చేసాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. సూర్య సొంత నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మిస్తుంది అని  టాక్. అయితే  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తాను చేయబోయే కొత్త సినిమాకు పవన్ మహేష్ లలో ఎవరో ఒకరిని ఎంచుకుని ముందుకు వెళతాడా  లేదంటే కోలీవుడ్ బాట పడతాడ అనే విషయం పై ఈ సంవత్సరాంతానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: