నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ ‘మా’ సంస్థ ఎన్నికల గురించి ‘మా’ సంస్థ రాజకీయాల  గురించి ఒక విశ్లేషణాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేయడమే కాకుండా నాగబాబుతో ఒక  స్పెషల్ ఇంటర్వ్యూను ఆ  ఛానల్ ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూలో నాగబాబు ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ సంస్థ ఎన్నికల గురించి ఆ సంస్థలోని రాజకీయాల  గురించి వివరణలు ఇవ్వడమే కాకుండా తన పై తీవ్ర ఆరోపణలు చేసిన నటి హేమ పై రివర్స్ సెటైర్స్ వేసాడు నాగబాబు. అంతేకాదు కృష్ణంరాజు, జయసుదల పై కూడా కామెంట్స్ చేసాడు నాగబాబు.

నటి హేమ ఒక అమాయకురాలనీ ఆమె మురళీమోహన్ చేతిలో ఒక కీలు బొమ్మగా మారి ఆయన  చెప్పమన్నట్లుగా మాట్లాడింది  కాని అసలు విషయాలు నటి హేమకు తెలియవు అనీ చురకలు వేసాడు నాగబాబు. మురళీమోహన్ రాజకీయ చతురత, రాజకీయ తంత్రం రాజకీయాలలో చూపెట్టకుండా అనవసరంగా ‘మా’ సంస్థలో రాజకీయాలను సృష్టి  స్తున్నారని అభిప్రాయ పడ్డాడు నాగబాబు. 

తాను  అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ‘మా’ సంస్థకు ఒక చిరునామా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో స్థలం కోసం చాల సార్లు తిరిగినా పని జరగక పోవడంతో  తాను ‘మా’ కమిటీ అలాగే ‘మా’ సర్వసభ్య సమావేశ అనుమతితో ఆ భవనాన్ని కొన్నానని అయితే దానిని తన తరువాత వచ్చిన అధ్యక్షుడు మురళీమోహన్ ఆ అపార్టుమెంటు పట్ల శ్రద్ద పెట్టక పోవడంతో అ బిల్డింగ్ విలువలేని వస్తువుగా మారిపొయిందనీ అంటూ ప్రతి విషయాన్ని రియలెస్టేట్ దృష్టిలో చూసే మురళీమోహన్ చెప్పిన మాటలకు ప్రభావితమై అవగాహన లేకుండా హేమ మాట్లాడింది అంటూ ఆమె పై సెటై ర్లు వేసాడు నాగబాబు. 

మార్పు కోసం మంచి కోసం అన్న నినాదంతో ముందుకు వెళుతున్న రాజేంద్రప్రసాద్ ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు తన వంతు సహకారమే కాకుండా తన సన్నిహితుల సహకారం కూడా ఉంటుంది అని నాగబాబు మరోసారి స్పష్టంగా ఛానల్ కెమెరాల ముందు చెప్పడంతో నాగబాబు రాజేంద్రప్రసాద్ కోసం తుది సమరానికి సిద్ధం అయినట్లుగా స్పష్టమైన సంకేతాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియచేసాడు. దీనితో ‘మా’ అధ్యక్ష పదవికి మెగా వార్  తెర లేచినట్లే అనుకోవాలి. ఇది ఇలా ఉండగా ‘మా’ సంస్థ ఎన్నికలలో అన్యాయాలు జరుగుతున్నాయి అంటూ ఒ. కళ్యాణ్ అనే వ్యక్తి వేసిన పిటీషన్ హైదరాబాద్ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించి మురళీమోహన్ కు నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: