విలక్షణ  నటుడు ప్రకాష్  రాజ్ నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేటి హీరోల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్  నిర్వహించిన  ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ తన వ్యక్తిగత జీవితం గురించి నేటి సినిమాల గురించి అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు. 

గతంలో సినిమాలలో నటించే హీరోలను  లాయరుగానో, డాక్టరు గానో, వ్యాపారిగానో  ఎదో  ఒక వృత్తి చేస్తున్నట్లుగా ఆ హీరోను చూపెట్టేవారని కానీ  నేటి తరం హీరోలు నటిస్తున్న చాల సినిమాలలో  వారు ఏమి చేస్తున్నారో కూడా తెలియని పరిస్థుతులలో సినిమాలు వస్తున్న పరిస్థుతుల పై మీ అభిప్రాయం ఏమిటి  అని యండమూరి ప్రశ్నించినప్పుడు ప్రకాష్ రాజ్ ఒక విలక్షణమైన సమాధానం  ఇచ్చాడు. 

నేటితరం హీరోలు, హీరోలుగా కనిపించడమే ఒక ప్రధాన వృత్తి అని కామెంట్ చేస్తూ  నేటి తరం ప్రేక్షకులు కూడా అటువంటి బాధ్యతలను లేని హీరోలను చూడటానికి ఇష్టపడుతున్నారు అంటూ నేటి యూత్ ట్రెండ్ పై అదేవిధంగా నేటి తరం హీరోల పై సెటైర్లు వేసాడు ప్రకాష్ రాజ్. అదేవిధంగా సినిమా  తారల డైవర్స్ ల గురించి మాట్లాడుతూ సమాజంలోని ఎన్నో వర్గాలలో భార్య భర్తల మధ్య అభిప్రాయ భేధాలు ఏర్పడినప్పుడు డైవర్స్ తీసుకోవడం సర్వ సాధారణమే అయినా  సినిమా రంగంలో ఉండే విపరీతమైన స్వేఛ్చ వల్ల ఈ డైవర్స్ కల్చర్ ఎక్కువగా ఉంది  అని కామెంట్ చేసాడు ప్రకాష్ రాజ్.

తనకు ఎంతో నచ్చిన నటనను  వృత్తిగా మార్చుకుని కేవలం డబ్బు కోసం చేసిన సందర్భాలు చాల ఉన్నాయి అంటూ భవిష్యత్ లో తాను కోరుకున్న స్థాయిలో డబ్బు సంపాదించిన తరువాత డబ్బు కోసం నటించడం మానివేసి తనకు నచ్చిన పాత్రలను అవసరం అనుకుంటే పారితోషికం లేకుండా నటిస్తూ తనలోని నటుడుని బ్రతికించుకోవాలని ఆశ పడుతున్నానని షాకింగ్ కామెంట్స్ చేసాడు ప్రకాష్ రాజ్.ఒక సాధారణ నర్సుకు కొడుకుగా పుట్టి  స్వయం కృషితో ఎన్నో విజయాలను అందుకున్న ప్రకాష్ రాజ్  ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోపంరాని వాడు మనిషి కాడు అంటూ చెప్పడమే కాకుండా కోపం వేరు అహంకారం వేరు అంటూ అనే ఒక కొత్త వాదానికి తెర తీసాడు ప్రకష్ రాజ్..



మరింత సమాచారం తెలుసుకోండి: