నిన్న జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి పోయినందుకు దేశవ్యాప్తంగా  ఉన్న 120  కోట్ల భారతీయలు బాధపడితే రామ్ గోపాల వర్మ  మాత్రం ఆనందంగా పండుగ చేసుకున్నాడు. అంతేకాదు తన ట్విటర్ లో దేవుడికి కృతజ్ఞతలు చెపుతూ ట్విట్ పెట్టాడు. 


ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది భారతీయులకు అంటు వ్యాదిలా వ్యాపించిన క్రికెటైటిస్ జబ్బు నుంచి కాపాడాలని నేను చేసిన ప్రార్ధనలు విని దేవుడు రక్షించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు వర్మ. మనిషి మద్యానికి, సిగరెట్లకు బానిసైతే వ్యక్తిగతంగా మాత్రమే నష్టపోతారని కాని క్రికెట్‌కు బానిసైతే జాతి మొత్తం జబ్బు పడుతుందనీ ఘాటు విమర్శలు చేశాడు రాంగోపాల్ వర్మ. 

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ ఈసారి ఇలా ఘాటైన కామెంట్లు క్రికెట్ ఆట పై చేయడం సంచలనంగా మారింది.  నిన్న మొన్నటి దాక దేవుళ్ళను టార్గెట్ చేసిన వర్మ ఈ సారి ఏకంగా భారతీయులంతా వారి జీవితలకన్నా అత్యంత విలువైనదిగా భావించే క్రికెట్ గేమ్ ను టార్గెట్ చేయడం లేటెస్ట్  ట్విస్ట్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: