పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ తెగ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ కి మరో మంచి ఆఫర్ వచ్చింది. అదే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. సుకుమార్ అంటే చాలా రిచ్ క్వాలిటీస్ ఉన్న దర్శకుడు ఏదైనా చాలా అఫిషియల్ గా డీల్ చేసే వ్యక్తి తన సినిమాలు కూడా అలాగే చూపిస్తాడు. రొమాన్స్, సెంటిమెంట్స్, ఫైట్స్ ఎక్కడా తగ్గడు.


టెంపర్ షూటింగ్ లొకేషన్ లో ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్


మరి అలాంటి దర్శకుడి సినిమాలో నటించడం ఎన్టీఆర్ తెగ ఆనంద పడిపోతున్నాడట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ దాదాపు లండన్ లోనే ఉంటుందట. ఆ మద్య మహేష్ బాబు నెనొక్కడినే సినిమా కూడా లండన్ అందాలు చూపించారు.  దీంతో ఎన్టీఆర్ ఆ సినిమా సాధించిన విజయంతో వెంటనే మరో సినిమాకి పచ్చజెండా ఊపేశాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఏప్రిల్‌ 17న ఎన్టీఆర్‌ బృందం లండన్‌కి పయన మవుతోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈచిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.


ఇదిలావుంటే, ఎన్టీఆర్‌ మరో సినిమాకి కూడా రంగం సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. ‘అదుర్స్‌’లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మాతగా ఓ చిత్రం రూపొందనుందని టాలీవుడ్‌ టాక్‌. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి కళ్యాణ్‌ సిద్ధంగా ఉన్నారట.  ఇదండీ సంగతి అందుకే ఎన్టీఆర్‌ మంచి  జోరుమీద ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: