వెరైటీ సినిమాలు చేయడంలో అక్కినేని నాగార్జున ముందు వరసలో ఉంటాడు. అయితే నాగ్ నట వారసుడిగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న నాగచైతన్యకు మాత్రం తనకు వెరైటీ పాత్రలు ఉన్న సినిమాలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నాడు. ఎప్పటికప్పుడు వెరైటీ పాత్రలతో వెరైటీ సినిమాలు చేస్తున్న నానీని చూస్తూ ఉంటే తనకు అసూయ కలుగుతోందని షాకింగ్ కామెంట్స్ చేసాడు చైతు. 

అంతేకాదు తనకు అటువంటి మంచి సినిమాలు ఎందుకు రావడం లేదు అని బాధ పడతానని నాగచైతన్య సెటైర్లు విసిరాడు. ఇలాంటి సినిమాలు తియ్యాలి అంటే నిర్మాతలకు చాల మొండి ధైర్యం ఉండాలని అటువంటి ధైర్యం ఉన్న నిర్మాతలు నానీకి దొరకడం అతడి అదృష్టం అంటూ కామెంట్స్ చేసాడు నాగచైతన్య. 

నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సక్సస్ మీట్ లో ముఖ్య అతిధిగా వచ్చిన నాగచైతన్య ఈ కామెంట్స్ చేసాడు. అయితే ప్రయోగాలు మాత్రమే మిగులుతున్నాయి కాని కోట్లను కొల్లగొట్ట లేకపోతున్నాడు నాని. మంచి నటుడిగా పేరున్నా ఈ సంవత్సరం కూడా నానీకి పెద్దగా కలిసి వచ్చే సూచనలను ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కలిగించ లేకపోయింది అన్నది వాస్తం. మరి నానీకి కలక్షన్స్ పరంగా కలిసి  వచ్చే సినిమాలు ఎప్పుడూ వస్తాయో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: