ఆస్ట్రేలియా, భారత్ మధ్య గురువారం జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ అందరిలోనూ ఉత్కంఠను రేపింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం చూసింది. ఇదిలా ఉంటే, భారత స్టార్ ఆటగాడు, విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆ మ్యాచ్ ని చూడటానికి సిడ్నీ చేరుకుందనే విషయం తెలిసిందే.

తన లవర్ విరాట్ కోహ్లీ ఆడుతున్న మ్యాచ్‌ను కనులారా తిలకించేందుకే అక్కడకు వెళ్ళడంతో, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇది హాట్ న్యూస్ గా మారింది. అనుష్కను తను ప్రేమిస్తున్నట్టుగా కొద్ది రోజుల క్రితం విరాట్ చెప్పిన విషయం గతంలో హాట్ న్యూస్ గా మారింది. వీరిద్దరి మధ్య ఇన్ని విశేషాలు ఉండటం కారణంగా, విరాట్ కోహ్లి ఆడబోతున్న సెమీస్ మ్యాచ్ పై అందరిని ద్రుష్టి పడింది.

అయితే, ఆస్ట్రేలియాతో పోరాడాల్సిన తుదిపోరులో విరాట్ కోహ్లి కేవలం 1 రన్ తో అవుట్ అయి, వెనక్కి తిరిగాడు. ఆ సమయంలో అనుష్క శర్మరియాక్షన్స్ అందరిని ఆకట్టుకున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: