ప్రపంచంలో టెక్నాలజీ ఏ విధంగా ముందుకు పోతుందో అందరికీ తెలుసు. ఈ టెక్నాలజీ మంచి కోసం కొంతైతే చెడుకోసం చాలా అన్నట్లు ఉంది. ముఖ్యంగా సెల్ ఫోన్ లో వీడియోలు,ఫోటోలు తీయడం మొదలు పెట్టినప్పటి నుంచి అందులోనూ సామాన్యులకు సైతం అన్ని హంగులు ఉన్న సెల్ ఫోన్ చేతిలోకి వస్తుంది. దీంతో రోమియోలు వీటిని చాలా నీచ పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా వాట్సప్ ఇది మెస్సేజ్, వీడియోలు వెంట నే చేరవేసే యాప్ దీనితో కూడా దుశ్చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా మహిళలపై సామూహిక అత్యాచారం చేసి సదరు ఘటనను వీడియో తీసి వీడియోను వాట్సప్‌లో పెట్టిన కేసులో ఒకరనిని ఒడిషా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ఈ నీచులను పోలీసులు అరెస్ట్‌ చేసిన వ్యక్తి భువనే శ్వర్‌కు చెందిన సుబ్రతాసాహూ అని పోలీసులు వెల్లడించారు.


సామాజిక కార్యకర్త సునితా కృష్ణన్


అత్యాచార ఘటన వీడియోను వాట్సప్‌లో చూసిన హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త సునితాకృష్ణన్‌ షేమ్‌ది రేపిస్ట్‌ పేరిట వీడియోలోని కామాంధులను గుర్తు పట్టండంటూ  ఆ మధ్య సోషల్‌ మీడియాలో ఉద్యమం ప్రారంభించింది. అంతే కాదు ఆమెపై దాడి కూడా చేశారు.  అయినా ఆమె భయపడకుండా అత్యాచార బాధితులకు అండగా ఉంటూ సునితాకృష్ణన్‌ హైదరాబా ద్‌లో ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.


సునితా కృష్ణన్ పోస్టు చేసిన రేపిస్టుల ఫోటోలు



ఫిబ్రవరిలో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు ఈ కేసును విచారించాలంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి సీబీఐ ఇందుకు సంబంధించి పలు కేసులను నమోదు చేసింది. నిందితులు ఒడిషా, పశ్చిమబెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన వారుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఒక నిందితున్ని బుధవారం పట్టుకున్నారు. అరెస్ట్‌ చేసిన నిందితున్ని ఢీల్లీ తరలించనున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: