చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తాను నటించిన మొదటి సినిమా ‘చిరుత’ సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన ‘మగధీర’ చరణ్ ను ఒకేఒక్కసారిగా టాలీవుడ్ టాప్ యంగ్ హీరోల లిస్టులో చేర్చేసింది. ఆ తరువాత కొన్ని పరాజయాలు ఎదురైనా చరణ్ టాప్ యంగ్ హీరోల రేసులో తన స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు.


శ్రీను వైట్ల దర్శకత్వోంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్


క్రితం సంవత్సరం విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా కలెక్షన్స్ పరంగా చరణ్ కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ గా మారకపోయినా చరణ్ కు మoచి నటుడిగా పేరు సంపాదించి పెట్టింది. అయితే ఆల్ రౌండర్ అవ్వాలన్న చరణ్ అభిలాషతో మరో ప్రయోగానికి చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీకారం చుడుతున్నాడు. 


రాంచరణ్ కి శ్రీను వైట్ల  బర్త్ డే గిఫ్టుగా చరణ్ ఫస్ట లుక్


ఈ నెల మార్చి 16న పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక స్టంట్ మేన్ గా కనిపిస్తాడు అని వార్తలు వస్తున్నాయి. యాక్షన్ స్టంట్ మాస్టర్ గా ఒక డిఫరెంట్ గెటప్ లో చరణ్ కనిపించబోయే ఈ పాత్ర శ్రీను వైట్ల కామెడీ టచ్ తో ఉంటుందని టాక్. 


రాంచరణ్ కొత్త హెయిర్ స్టైల్ 


ఈపాత్ర కోసం చరణ్ ఇప్పటికే తన బరువును తగ్గించుకోవడమే కాకుండా ముంబాయి నుండి వచ్చిన ఒక హెయిర్ స్టైలిస్ట్ సలహాతో చరణ్ ఈ సినిమాలో మరో కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తాడని టాక్. అంతేకాదు చరణ్ ఈసినిమాలో డిఫరెంట్ లుక్  లో కనిపించడానికి  రోజుకు నాలుగు  గంటలు చొప్పున జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది. చరణ్ కోరుకున్న బ్లాక్  బస్టర్ ను శ్రీనువైట్ల అందివ్వగలడా అన్న విషయo అక్టోబర్ లో తేలనున్నది..



మరింత సమాచారం తెలుసుకోండి: