సుమ అంటే బుల్లితెరపై కనిపించే చిరునవ్వు గల గలా మాట్లాడే స్వరం.. కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు ఏకంగా వ్యాఖ్యానం (యాంకరింగ్‌) చేస్తూ ఈ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, ఆకర్షణీయమైన రూపం, చెరగని చిరునవ్వు, సమయస్పూర్తి ఈమె సొంతం. తెలుగు, మళయాళంలతో పాటు హిందీ మరియు ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యానం (యాంకరింగు) చేసి మంచి గుర్తింపును పొందారు.


భర్త రాజీవ్ కనకాల, ఇద్దరు పిల్లలతో యాంకర్ సుమ కనకాల 


ఈటీవీ స్టార్ మహిళ కార్యక్రమం ద్వారా ఆమె దేశంలోనే అత్యధిక గేమ్ షో ఎపిసోడ్‌లకు యాంకరింగ్ చేసిన ఘనత సొంతం చేసుకున్నారు. దీంతో ఆమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు.


స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో యాంగకరింగ్ చేస్తున్న సుమ కనకాల


ఈ సందర్భంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు జారీ చేసిన సర్టిఫికేట్‌ను మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు ఆమెకు ఓ కార్యక్రమంలో అందజేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమపై ప్రశంసల జల్లు కురిపించారు. 
టివి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ (ఆడియో రిలీజు) కార్యక్రమాలలోచక్కటి సమయస్పూర్తితో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: