వివాదాలకు కేంద్రంగా మారిన మా (మూవీ అసోసియేషన్)  సిటీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్లుండి ఆదివారం నాడు మా ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో   మురళి వేసిన పిటీషన్ పై కోర్టు శుక్రవారం విచారణ చేసి తీర్పు చెప్పింది. మా ఎన్నికలను నిర్వహించవచ్చుననీ, ఐతే ఎన్నికల పోలింగ్ మొత్తాన్ని వీడియో తీయాలని సూచించింది. అదేవిధంగా ఫలితాలను వెల్లడించవద్దని కూడా ఆదేశించింది. దీనితో మా ఎన్నికలు ఆదివారంనాడు షెడ్యూలు ప్రకారమే జరుగనున్నాయి.


మా ఎన్నికల సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టినపుడు మాట్లాుడుతున్న శివాజీరాజ.

చిత్రంలో ఏడిద,నాగబాబు, రాజేంద్ర ప్రసాద్


గత కొద్ది రోజులుగా మా ఎన్నికలపై రగడ సాగుతుంది. ఇది రాజకీయ రంగు పులుముకొని ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకుంది. అంతే కాదు జయసుధ, రాజేంద్రప్రసాద్ మధ్య గత కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ వర్గం ఏకంగా ఎలక్షన్ కమిషనర్ మీదే తీవ్రమైన ఆరోపణలు చేశారు.

జయసుధకు మద్దతుగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న సినీ ప్రముఖులు


తర్వాత జయసుధ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాజకీయ నాయకుల దగ్గర నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తనను పోటీ నుంచి తప్పుకోవాలని ఆరోపించారు. ఈమె మద్దతుగా కృష్ణం రాజు, మురళీ మోహన్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

అలాగే జయసుధ కూడా రాజేంద్రప్రసాద్ వర్గం సెల్ ఫోన్లు పంచుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇలా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో రాజేంద్రప్రసాద్ ప్యానెల్ కు చెందిన ఓ కళ్యాణ్ ఎన్నికలు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎలక్షన్స్ ఆపేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఎలక్షన్స్ మాత్రం నిర్వహించుకొని కౌంటింగ్ మాత్రం నిర్వహించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తాని ఎలక్షన్స్ గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎవరి లాభియింగ్ లో వారే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: