ప్రముఖ సినిమా రచయిత కోనవెంకట్ తాను దారి దోపిడీకి  గురి అయ్యాను అంటూ ట్విట్ చేసాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈవార్తల  ప్రకారం కోన వెంకట్ నిర్మాత దానయ్యతో కలిసి మొన్న ప్రకాష్ రాజ్ తన ఫామ్  హౌస్ లో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు పార్టీని ముగించుకుని రాత్రి తమ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే  షాద్ నగర్ హై వే ప్రాంతంలో కోన వెంకట్ ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని కత్తితో బెదిరించితమ వద్ద  ఉన్న డబ్బును విలువైన వస్తువులును దోచుకుని అక్కడ నుండి పారిపోయారని తన ట్విట్  లో తెలియచేసాడు. 

నూర్ కాలేజీ సమీపంలోకి కోన వెంకట్ ప్రయాణిస్తున్న కారుని ఆపిన దోపిడీ దొంగలు గొడ్డలితో కారు అద్దాలు పగలగొట్టారు. డ్రైవర్ పై చేయి చేసుకుని  చంపుతామని బెదిరించడంతో కోన వెంకట్ తన మెడలోని గొలుసు, నిర్మాత దానయ్య నుంచి రెండు గొలుసులు, రెండు ఉంగరాలు, డ్రైవర్ నుంచి 1500 రూపాయలను తీసుకుని ఆ దొంగలు పరారయ్యారు అని అంటున్నాడు. ఈ సంఘటన పై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

షాద్ నగర్ కేసంపేట్  రోడ్ లో తమ  కార్ ప్రయాణిస్తున్న సమయంలో ఒక చెట్టు వెనుక నుండి కొంతమంది వ్యక్తులు తమ  కారును అడ్డగించి డ్రైవర్ విండోను బలవంతంగా తెరిపించి కత్తితో ఈ సంఘటనకు పాలు పడినట్లు   కోనవెంకట్ తెలియ తెలియ చేసాడు. ఈ సంఘటనతో తానూ షాక్ కు గురి అయ్యాను అని చెపుతూ షాద్ నగర్ కేసంపేట్ మార్గం లో ప్రయాణించే వారు జాగ్రతాగా ఉండాలి అంటూ జాగ్రత్తలు చెపుతున్నాడు కోన వెంకట్..  


మరింత సమాచారం తెలుసుకోండి: