ఈ మధ్య సినిమాల్లో ఐటమ్  సాంగ్స్ సందడి బాగా పెరిగిపోయింది. ప్రతి సినిమాలో హీరోకి ఇండ్ర డక్షన్ ఎంత ముఖ్యమో ఐటమ్ సాంగ్ అంత ముఖ్యం. ఇది ఎంత అవసరమైందంటే గతంలో ఐటమ్ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా ఉండేవారు. జయమాలిని, జ్యోతి లక్ష్మి, సిల్క్ స్మిత లాంటి వారు కానీ ఇప్పుడు ఏకంగా టాప్ హీరోయిన్లే ఐటమ్స్ సాంగ్స్ కి రెడీ అవుతున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘టెంపర్’ చిత్రంలో కెనడియన్ మోడల్ నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. 


 కెనడియన్ మోడల్ నోరా ఫతేహి హాటో ఫోటో


అయితే బాహుబలి లో ఒక ఐటమ్ సాంగ్ తో ఎంట్ర టైన్ చేయాలని జక్కన్నకు ఆలోచన వచ్చింది. దీనికోసం చాలా మందిని సంప్రతిచాడు. చివరకు   ‘టెంపర్’ చిత్రంలో ఐటమ్ సాంగ్ తో ఊపిన కెనడియన్ మోడల్ నోరా ఫతేహి కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడు.


టెంపర్ మూవీలో ఐటమ్ సాంగ్ లో ఎన్టీఆర్, నోరా ఫతేహి


బెల్లీ డ్యాన్స్, హిప్ హాఫ్ లో శిక్షణ తీసుకున్న నోరా ‘టెంపర్’లోని ఐటమ్ పాటని ఇరగదీసింది. క్లాస్, మాస్ ఆడియన్స్ ని నోరా ఫతేహి ఈ పాట ద్వారా బాగా ఆకట్టుకుంది. బాహుబలిలో చిత్రంలో త్వరలోనే ఈ పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్. ఏంతోమంది ఐటమ్ భామలను ఈ పాట కోసం తీసుకోవడానికి పరిశీలించారట. కానీ ఫైనల్ గా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం నోరాకి దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: