బాలీవుడ్ లో సెక్సు తారగా అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో నిద్రపోతున్న ఫోర్న్ భామ సన్నీలియోన్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది.   సన్నీ లియోన్ బాలీవుడ్‌లోనే కాకుండా తమిళ, తెలుగు భాషల్లో కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలుగులో మంచు మనోజ్ సరసన వచ్చి వంపు సొంపులతో హల్ చల్ చేసింది. ఇప్పుడు  పూర్తిస్థాయి నటిగా పరిశ్రమ కొనసాగుతున్నా ఇటీవల ఒక మీడియా అడిగిన ప్రశ్నకు సన్నీ మాట్లాడుతూ కొంత మంది హీరోల భార్యలు తమ భర్తలు నాతో నటించకూడదని కోరుకుంటున్నారు.


ఏక్ పహిలీ లీలా సినిమాలో దృశ్యం


గతంలో నేను నటించిన ఫోర్న్ సినిమాలను బట్టి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వారి భర్తలను వలలో వేసుకుంటానని వారి అనుమానమేమో..’ అని చెప్పింది. ‘మీ భర్తలు నాకు అవసరం లేదు. నాకూ భర్త ఉన్నాడు’ బాలీవుడ్ హీరోల భార్యలను తిట్టకనే తిట్టినట్టు చేసింది.   హీరోల భార్యల తీరుపైనా ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. తను గతంలో పోర్న్‌ స్టార్‌ కావడంతో ఇప్పటికీ కొందరు చిన్నచూపు చూస్తున్నారని చెబుతోంది సన్నీ. తాను ఇప్పుడు బిజీ స్టార్‌నే. కానీ, ఇప్పటికీ కొంత మంది హీరోలు తనతో కలిసి నటించడానికి వెనుకాడుతుంటారని, తనతో నటిస్తే ఎక్కడ వారి స్థాయి తగ్గుతుందో అని వారు భయపడుతున్నారని సన్నీ తెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: