ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ గా తెరకెక్కుతున్న మూవీలలో ఒకటి కిక్-2. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ఒక క్లారటీకి రావడమే కాకుండా, ప్రమోషన్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ ని కూడ ప్లానింగ్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమ్మర్ లో రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉంటే, వీటికి పోటీగా బరిలోకి కిక్-2 దిగటం అనేది అందరిని ఆశ్ఛర్యపరుస్తుంది.

మాస్ మహారాజా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘కిక్' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్లీ కిక్ టీమ్ తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘కిక్-2' చిత్రానికి సంబంధించి రెండు పాటలను స్విట్జర్లాండ్ లో చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 3 నుండి అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించే పాటతో చిత్రానికి సంబంధించిన టోటల్ షూటింగ్ పూర్తవుతుంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ స్పెషల్ గా మే 7న ‘కిక్ 2' చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఏరియా వైజ్ బిజినెస్ సైతం మంచి ఊపందుకుంది.

ఇప్పటికే నైజాం రైట్స్, అలాగే ఓవర్సీస్ రైట్స్ కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్స్ పోటీపడుతున్నారు.  మాస్ మహరాజా రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తంగా కిక్-2 మూవీ ఘనవిజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ పూర్తి నమ్మకాల్ని పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: