ఈరోజు ఉదయం 8 గంటల నుండి ఎన్నో వివాదాల  మధ్య సాధారణ ఎన్నికల  హడావిడి మించి  తీవ్ర ఆరోపణల మధ్య ప్రచారం జరిగిన ‘మా’ సంస్థ ఎన్నికలు  ప్రారంభం కాబోతున్నాయి.  మధ్యానం 2 గంటలవరకు  జరిగే ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి పవన్ వస్తాడా ?  వచ్చినా  ఓటు వేస్తాడు  అన్న  ఊహాగానాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. 


పవన్ వస్తాడా ?  వచ్చినా  ఓటు వేస్తాడు 


సాధారణంగా ఏ సినీనటీనటులైనా ఎవరికి ఓటేస్తారనేది పూర్తిగా వారి వ్యక్తిగతం. అయితే  పవన్ టాలీవుడ్  ఎంపరర్ కాబట్టి ఈ ఎన్నికల విషయంలో పవన్ తీరు ఎలా ఉంటుంది అన్న విషయం పై తీవ్ర ఆశక్తి ఉంది.  సాధారణంగా టాలీవుడ్  లో జరిగే ఏ  కార్యక్రమానికి పవన్ రాడు.

పవన్ వచ్చి రాజేంద్రప్రసాద్ కు  ఓటు వేస్తాడని

 
ఆఖరికి హుదూద్ బాదితుల  కోసం టాలీవుడ్ ఏర్పాటు చేసిన ‘మేముసైతం’ కార్యక్రమానికి కూడా పవన్  డుమ్మా కొట్టాడు. ఈ నేపధ్యంలో పవన్  ఈరోజు జరుగుతున్న ‘మా’ సంస్థ ఎన్నికల పోలింగ్ కు రావడమే కష్టమని కొందరు అంటున్నారు.  మరి కొందరైతే  తనుకు తన అన్న  నాగబాబుకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా పవన్ వచ్చి రాజేంద్రప్రసాద్ కు  ఓటు వేస్తాడని మరికొందరు అంటున్నారు. 


ఈరోజు ‘మా’ఎన్నికలకు

ఈరోజు ‘మా’ఎన్నికలకు ఎవరు  వచ్చి ఓటు  వేసినా వెయ్యకపోయినా  పవన్ విషయం ఫై మాత్రం అందరు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: