‘బాహుబలి’ రాబోతున్న మే 15న విడుదల అవుతుంది అని రాజమౌళి ఇప్పటికే అధికారికంగా ప్రకటన ఇచ్చినా  ఈ  సినిమాకు సంబంధించిన గ్రాపిక్ వర్క్స్ చాల  నెమ్మదిగా జరుగుతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ‘బాహుబలి’  విడుదల మరో నెలరోజులు వాయిదా పడి ఈసినిమా జూన్ మధ్యలో విడుదల అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

అయితే ఈ వార్తలు మహేష్ కు మరో కొత్త సమస్యను తెచ్చి పెట్టింది అని అంటున్నారు. ఇప్పటికే మహేష్ నటిస్తున్న ‘శ్రీమంతుడు’ తన రిలీజ్ డేట్ ను జూలై 17కు ఫిక్స్ చేసుకోవడంతో ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ కి మధ్య నెల రోజులు  గ్యాప్ ఉన్నా ఊహిస్తున్న విధంగా ‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ అయితే ప్రేక్షకులు అంతా ‘బాహుబలి’ మాయలో ఉంటారు కాబట్టి కేవలం  నెల రోజుల గ్యాప్ లో వచ్చే తన ‘శ్రీమంతుడు’ ‘బాహుబలి’ హవా మధ్య ఎగిరి పోతుందేమో అన్న  భయం మహేష్ ను వెంటాడుతోంది. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో  మహేష్ ‘శ్రీమంతుడు’ కూడా మరో నెల ముందుకు జరిగి  ఆగష్టు 15ను టార్గెట్ చేసుకుంటూ  వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. నిజంగా ‘బాహుబలి’ మేలో విడుదల కాకపోతే చాల చిన్న సినిమాలకు పండగగా మారి సమ్మర్ సీజన్ చిన్న సినిమాలకు కలిసి వచ్చేలా చేస్తుందని అని టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: