ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాలలోకి వచ్చి పెద్దగా ప్రశ్నించకుండా వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్న పవన్ తరఫున వకాల్తా నిఖిల్ తీసుకున్నాడా అని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఆ రాష్ట్ర ఎమ్ఎల్ఎ లు అందరికీ ఖరీదైన ఐ ఫోన్లు బహుమతిగా కొని ఇచ్చిన విషయం పై మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 


ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడ డబ్బులు లేక 


ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడ డబ్బులు లేక తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు ఇటువంటి విలాసవoతమైన బహుమతుల కోసం ఇంత మితిమీరిన ఖర్చులు పెట్టాలా అంటూ  విమర్శల దాడి  జరుగుతోంది. ఈ విమర్శకుల లిస్టులో యంగ్ హీరో నిఖిల్ కూడా చేరిపోయాడు.


నిఖిల్ తన ట్విటర్ లో ప్రశ్నిస్తున్నాడు


 17, 500 కోట్లు  అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యుడు  పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును ఇలా విలాసాల నిమిత్తం ఖర్చు చేయడం  ఏమిటి అంటూ నిఖిల్ తన ట్విటర్ లో ప్రశ్నిస్తున్నాడు. ఇటువంటి  విషయాల పై నాయకులను ప్రశ్నిస్తాను అంటూ  ‘జనసేన’ పార్టీ పెట్టిన పవన్ స్పందించకపోయినా నిఖిల్ ప్రశ్నించడం అందరికీ ఆశ్చర్యంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: