టాలీవుడ్ సినిమా రంగానికి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రమోహన్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది అన్నది వాస్తవమే అయినా సినిమా రంగంలో మనిషి విలువను కేవలం డబ్బుతోనే కొలుస్తారు అంటూ  సినిమా రంగంలోని  అనేక చేదు నిజాలను బయట పెట్టాడు. 


ఎందరో మహా వ్యక్తులు చనిపోయినప్పుడు


కాంతారావు లాంటి టాప్ హీరో తన చివరి రోజులలో 500 రూపాయలకు కూడా ఇబ్బంది పడుతూ వేషాలు వేసిన పరిస్థుతులలో కనీసం ఆయనను ప్రొడక్షన్  యూనిట్ వారు కూడా పట్టించుకోని స్థితిని తాను చూసాను అంటూ  చేదునిజాలను బయట పెట్టాడు చంద్రమోహన్. రాజనాల, పద్మనాభం, రాజబాబు లాంటి ఎందరో మహా వ్యక్తులు చనిపోయినప్పుడు కనీసం దహన సంస్కారాలకు కూడా డబ్బులేదు  అన్న విషయం ఎందరికి తెలుసు  అంటూ వాస్తవాలను బయట  పెట్టాడు చంద్రమోహన్.  


పద్మశ్రీ అవార్డులకు విలువలేకుండా


భానుమతి, ఎస్వీ రంగారావుల కంటే మహానటులు టాలీవుడ్ లో మరెవ్వరూ లేరని  అంటూ గుమ్మడి, సత్యనారాయణ వంటి వారిని తప్పించి టాలీవుడ్ లో జూనియర్ లకు పద్మశ్రీలు రావడం మొదలు పెట్టాక పద్మశ్రీ అవార్డులకు విలువలేకుండా పోయిందని కామెంట్స్ చేసాడు చంద్రమోహన్.  డబ్బుకు మాత్రమే విలువను ఇచ్చే నేటి పరిస్థుతులలో టాలీవుడ్ పరిశ్రమకు భవిష్యత్తులో మంచిరోజులు వస్తాయని తనకు నమ్మకం లేదు అని షాకింగ్ కామెంట్స్ చేసాడు చంద్రమోహన్..  

మరింత సమాచారం తెలుసుకోండి: