“బాహుబలి” విడుదల తేదిని నిర్ణయించడంలో ఒక జ్యోతిష్కుడి ప్రభావం రాజమౌళి పై ఉంది అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. రాజమౌళి అభిమానులే కాదు తెలుగు సినిమా ప్రేక్షకులు అంతా ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి’  మే15న వస్తోందంటూ దర్శకుడు రాజమౌళి ఇప్పటికే ప్రకటన చేసినా ఈ సినిమా  విడుదల మళ్ళీ ఒక  నెలరోజులు వాయిదా పడుతుందనే వార్తల హడావిడి మొదలయింది. 

దీనికి కారణం ఈసినిమా  గ్రాఫిక్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవడం అనే భావనలో ఉన్నారు అంతా. అయితే ఈసినిమా గ్రాఫిక్ వర్క్స్ చూస్తున్న టెక్నిషియన్స్ ఈసినిమా క్వాలిటీ రాజమౌళి ఆశించిన రీతిలో రావాలి అంటే కనీసం మూడు నెలలు సమయం కావాలి అని రాజమౌళికి స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  

దీని ప్రకారం ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవడానికి జూన్ నెలాఖరు అవుతుంది. కాబట్టి ఆ తరువాత ఈ సినిమా ప్రమోషన్ మొదలు పెట్టి పక్కా ప్లాన్ తో తనకు సూపర్ హిట్ ఇచ్చిన ‘మగధీర’ విడుదలైన జూలై 30న విడుదల చేయాలని రాజమౌళి కొత్త యాక్షన్ ప్లాన్ ఆలోచించాడు అని ఫిలింనగర్ టాక్. ఈ నిర్ణయం వెనుక రాజమౌళికి బాగా సన్నిహితుడైన ఒక సిద్ధాంతి హస్తం ఉందని గాసిప్పులు కూడా వినిపిస్తున్నాయి. 

రాజమౌళి జాతక రీత్యా జూలై నుంచి మంచి దశ ప్రారంభం కాబోతూ ఉండటంతో ఆ సమయంలో విడుదల అయితే ‘బాహుబలి’ కి  ఎదురులేదు అని ఆ సిద్ధాంతి జోష్యం అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే ‘బాహుబలి’  రాక కోసం  మరో మూడు  నెలలు ఎదురు చూపులు  తప్పదు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: