గత శుక్రువారం విడుదలైన గోపీచంద్ ‘జిల్’ సినిమాకు యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఎంటర్ టైన్మెంట్ లేకపోవడంతో ఈ సినిమా ‘లౌక్యం’  లా మంచి కలెక్షన్స్ ను అందుకునే అవకాశం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈవారం కూడా పెద్ద సినిమాల తాకిడి ఏమి లేకపోవడంతో ‘జిల్’ కు వినోదం జోడిస్తే ‘సన్నాఫ్ సత్యమూర్తి’  విడుదల అయ్యేదాకా కలెక్షన్స్ పరంగా ‘జిల్’ కు ఎదురు  ఉండదు అన్న ఆలోచనతో ఈ సినిమా దర్శక నిర్మాతలు ‘జిల్’ కోసం బ్రహ్మనందాన్ని రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా కోసం బ్రహ్మానందం కాల్ షీట్లు తీసుకుని ఇప్పటికే ఒక కామెడీ ట్రాక్ షూట్ చేసారని, అయితే అది కథలో ఇమడక పోవడంతో బ్రహ్మి పాత్రను పక్కకు పెట్టారని వార్తలు ఉన్నాయి. మరీ కామెడీ ఎక్కువైపోతే ఈ సినిమా కథ ట్రాక్ తప్పుతుందని అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. 

అయితే ఈ సినిమాను చూసిన  ప్రేక్షకులు మరి కాస్త ఫన్ వుంటే బాగుండేదని కామెంట్స్ రావడంతో ఇప్పటికే షూట్ చేసిన బ్రహ్మీ కామెడీ ట్రాక్ ఈసినిమాకు అతి త్వరలో జత చేస్తారు  అనే వార్తలు వినిపిస్తున్నాయి.  మరి బ్రహ్మి ‘జిల్’ ను  ఎంతవరకు కలెక్షన్స్ పరంగా సక్సస్ చేస్తాడో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: