దక్షిణాది సినిమా రంగంలో ఎందరో టాప్ హీరోలతో నటించిన సుమలత మన టాలీవుడ్ లో కూడా సీనియర్ హీరోలు అందరితోను నటించి మెప్పించింది. అటువంటి సుమలత కన్నడ హీరో అంబరీష్‌తో పెళ్ళి చేసుకున్నాక అప్పుడప్పుడు మాత్రమే సినిమాలలో కనిపిస్తోంది. సినిమాల నుండి రాజకీయాలలోకి వచ్చిన అంబరీష్ గతంలో కేంద్రమంత్రిగా కూడా చేసాడు.


 అంబరీష్ పై సుమలత సంచలన వ్యాఖ్యలు


అయితే అటువంటి తన భర్త అంబరీష్ పై సుమలత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమారంగంలో సహనటులను ప్రేమించి పెళ్ళి చేసుకున్నవారు అంతా సంతోషంగా ఉన్నారు అని అనుకోవడం పొరపాటు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తాను గతంలో అంబరీష్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్న నేపధ్యంలో అంబరీష్ తో జాగ్రత్తగా ఉండాలని నటి సుహాసిని చెప్పినట్లు సుమలత చెప్పింది. 


 అంబరీష్ తో జాగ్రత్తగా ఉండమని సుహాసిని సలహా


1990 ప్రాంతంలో మంచి బిజీ హీరోయిన్ గా ఉన్న సుమలత అంబరీష్ ను ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే కాకుండా అతడితో చాల సినిమాలలో కూడా నటించింది. అయితే ఎప్పుడో జరిగి పోయిన ఆ పెళ్ళి విషయంలో నటి సుహాసినితో పాటు అప్పటి తన మేకప్ మేన్ కూడ అంబరీష్ తో జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చారు అంటూ ఇప్పుడు ఆ విషయాన్ని తెరపైకి తెస్తూ ప్రస్తుతం తాను మాత్రం  చాల ఆనందంగా ఉన్నాను అంటూ సుమలత ఇప్పుడు చెప్పడం వెనుక రహస్యం ఏమిటి అంటూ సెటైర్లు పడుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: