సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయా అన్నంతగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీ పడుతున్నారు. కాగా, ఈ రెండు ప్యానెల్ లో ఉన్నవాళ్లు, ఒకరినొకరు ధూషించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక పోతే సెంకడ్ వర్గానికి వచ్చే వారు ఈ ఎలక్షన్స్ మరీ రసవత్తరం చేశారు. ఎన్నడూ బయట పడిన సినీమా ఇండస్ట్రీని రచ్చరచ్చ చేశారు. అంతేందుకు ఒకరి పై ఒకరు పోలీసు కేసులు పెట్టుకునే స్థాయికి చేరాయి.


మా ఎలక్షన్స్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్, జయసుధ మధ్య రగడ

విషయానికి వస్తే.. శివాజీరాజ ఎలక్షన్స్ సందర్భంగా మాట్లుడుతూ హేమ లాంటి తుప్పు పట్టిన అస్త్రాన్ని నాపై కి వదిలారు అంటూ వ్యంగంగా మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న హేమ అగ్గిలం మీదు గుగ్గిలం అయ్యింది. ఈ విధంగా మాట్లాడటం సభ్యత అనిపించుకోదనీ, నోరుజారిన విషయాన్ని గ్రహించి, తనకు క్షమాపణ చెప్పే సంస్కారం శివాజీ రాజాకి లేదని హేమ ఘాటుగా స్పందించింది. అతనిపై కేసు కూడా పెట్టాలనుకుంటోంది. కాకపోతే సినీ ఇండస్ట్రీ పెద్దలు డా.దాసరినారాయణ రావు వద్దకు ఈ పంచాయితి తీసుకువెళ్లి పరిష్కారం కోరుకోవాలని అనుకుంటుందట. ఈ ఇద్దరు దూషణల పర్వానికి తనకు ఏ సంబంధం లేదంటుంది జయసుధ.


మరింత సమాచారం తెలుసుకోండి: