బాలీవుడ్ హీరోయిన్ నగ్మా పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. 1990 ప్రాంతంలో టాలీవుడ్ లో టాప్  హీరోయిన్ నగ్మా. టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లతో అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించింది నగ్మా. ఆ తరువాత కాలంలో వచ్చిన యంగ్ హీరోయిన్స్ హవా తో నగ్మా టాలీవుడ్ కు దూరం అయింది. సినిమాలకు దూరం అయినా రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసినా ఆమెకు అక్కడ నిరాశ ఎదురైంది.

 

టాలీవుడ్ లో టాప్  హీరోయిన్ నగ్మా.


‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కొంత  కాలం బిజీగా గడిపిన నగ్మా ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో తనకు కూడా ఎవరైనా యంగ్ హీరోల అత్త పాత్రలు ఇస్తారేమో అని ఎదురు చూస్తోంది. ఈ నేపధ్యంలో దర్శకుడు రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న ‘సౌందర్య లహరి’ కార్యక్రమానికి అతిధిగా వచ్చి అలనాటి విషయాలను గుర్తుకు చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.  రాఘవేంద్రరావు తీసిన అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె ఆరోజులను గుర్తుకుచేసుకుంటూ రాఘవేంద్రరావు పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాంకర్ ఝాన్సీ తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నావు అని ఆమెని ప్రశ్నించినప్పుడు నగ్మా సమాధానం చెపుతూ తనకు తెలుగు కన్నా తెలుగు భాషలోని బూతులు బాగా తెలుసు అంటూ సెటైర్ వేసింది.


పండ్లుతో తన పై రొమాంటిక్ సాంగ్స్ ను


అంతేకాదు దీనికి  కారణం దర్శకుడు రాఘవేంద్రరావు అంటూ పువ్వులు, పండ్లుతో తన పై రొమాంటిక్ సాంగ్స్ ను రాఘవేంద్రరావు చిత్రీకరిస్తున్నప్పుడు ఆ సన్నివేశ అర్ధాలను దర్శకేంద్రుడు వివరిస్తూ ఉన్నప్పుడు  తనకు ఆ సీన్ లోని బూతు మాటల అర్ధం బాగా తెలియడంతో తనకు తెలియకుండానే తెలుగు భాషలోని బూతులు తనకు వచ్చేసాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నగ్మా. ఈ మాటలు విన్న రాఘవేంద్రరావు కూడా తెగ నవ్వుకున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: