నందమూరి  బాలకృష్ణకు, హరికృష్ణకు మధ్య సరైన సంబంధ బాంధవ్యాలు లేవు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే హరికృష్ణ కొడుకు నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. అంతేకాదు బాలయ్య అంగీకరిస్తే అతడితో కలిపి తాను నటిస్తూ ఒక మల్టీ స్టారర్ సినిమాను తీయాలని ప్రస్తుతం కలలు కంటున్నాడు. 


ఒక నిర్ణయం బాలకృష్ణకు తీవ్రమైన కోపం


అయితే కళ్యాణ్ రామ్ తీసుకున్న ఒక నిర్ణయం బాలకృష్ణకు తీవ్రమైన కోపం తెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘లయన్’ సినిమాను ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నాడు విడుదల చేయడానికి నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  

కళ్యాణ్ రామ్ నిర్మాతగా మారి


అయితే నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా మారి రవితేజాతో నిర్మిస్తున్న ‘కిక్ 2’ ని మే 7వ తారీఖున విడుదల చేయడానికి కళ్యాణ్  రామ్ నిశ్చయించుకున్నట్లు టాక్. అయితే ఈ వార్తలు బాలయ్య వరకు వెళ్ళడంతో కళ్యాణ్ రామ్ ను పిలిపించి బాలయ్య క్లాస్ పీకాదని ఫిలింనగర్ టాక్. 


లయన్’ ను టార్గెట్ చేస్తూ కళ్యాణ్ రామ్


ఒక వైపు తనతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటూ తాను నటించిన ‘లయన్’ ను టార్గెట్ చేస్తూ కళ్యాణ్ రామ్ నిర్మించిన ‘కిక్2’ విడుదల కావడం ఏమిటి అని బాలయ్య కళ్యాణ్ రామ్ ను ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో షాక్ కు గురైన కళ్యాణ్ రామ్ బాలయ్యను ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయం పై ఆలోచిస్తూ ‘కిక్ 2’ కు మరోలీజ్ డేట్ చూస్తున్నాడని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: