గత రెండు సంవత్సరాల నుంచి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఏవీ కలిసి రావడం లేదు. రోబో హిట్ తర్వాత తలైవాకి ఏవీ కలిసి రావడం లేదు. కూతురు తీసిని కొచ్చాడయాన్ కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇది పూర్తి యానిమెటెడ్ చిత్రం కాబట్టి జనాలకు అంతగా రుచించలేదు. భారీ నష్టాలనే చవిచూసింది. తర్వాత లింగ సినిమా కూడా అంతగా హిట్ కాలేదు. బయ్యర్లు కూడా భారీ నష్టాలపాలయ్యారు. దీనిపై పెద్ద రగడే జరిగింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘రోబో’కి సీక్వెల్ చేయడానికి రజనీ సుముఖంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే అది కూడా కన్ ఫార్మ్ అవ్వలేదట.


కంప్లీట్ యానిమెటెడ్ చిత్రం కొచ్చాడయాన్ సినిమాలో దృశ్యం


ఇకపై సినిమాల విషయంలో ఆచూ తూచి అడుగు వేయాలని నిశ్చయానికి వచ్చిన రజినీ కాంత్ కి  కన్నడ డైరెక్టర్ పవన్ ఒడయార్ ఆ మధ్య రజనీకాంత్ ని కలిసి ఓ కథ చెప్పాడట. కథ నచ్చిందని చెప్పిన రజనీ, సినిమా చేయడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇంకా ఇవ్వలేదట. తర్వాత ఆలోచిద్దాం అని చెప్పారట. అయితే ప్రస్తుతం మాత్రం ఈ ప్రాజెక్ట్ చేస్తే  తనకు కాస్త కలిసి వచ్చే అవకాశం ఉందని గ్రహించి చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.  త్వరలోనే పవన్ ని పిలిపించి దీనికి సంబంధించి డిటైయిల్డ్ గా చర్చించాలనుకుంటున్నారట.  ఒకవేళ ఈ చర్చలు సఫలం అయితే, రజనీకాంత్ తదుపరి సినిమాకి డైరెక్టర్ పవన్ ఒడయార్ అయ్యే అవకాశముందని చెన్నయ్ వర్గాలు అంటున్నాయి. అదే కనుక జరిగితే, పవన్ కి అంతకంటే కావాల్సిందేముంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: