ఈ మధ్య మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చదువుతున్నాం, చూస్తున్నాం. మహిళలకు జరుగుతున్న అన్యాయలను ఎదిరించి నిలిచినవారు కొందరు మాత్రమే భారత దేశంలో ఉన్నారు.  దీపికా పదుకొనే  ‘మై చాయిస్' వీడియో సంచలనం సృష్టిస్తోంది. భారతీయ సమాజంలో మహిళపై చూపుతున్న వివక్ష, మహిళలపై జరుగుతున్న దారుణాలు, మహిళల స్వేచ్ఛకు భారతీయ సమాజం ఏవిధంగా అడ్డు పడుతున్న విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ వీడియో సాగింది.


మై చాయిస్ వీడియోలో ఒక దృశ్యంలో దీపికా పదుకొనే


మహిళకు ఉన్న స్వాతంత్ర్య భావాలకు అద్దంపట్టే విదంగా బాలీవుడ్ కు చెందిన హోమీ అదజనియా ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఓ మహిళా ‘ మా శరీరం, మా మైండ్, మా ఇష్టం ’ అంటూ సాగిన ఈ వీడియో ఆడువారి వివిధ రూపాలు వారి శరీరంలో వచ్చా మార్పులు వారు వేసుకునే బట్టలు వారు జీవితంలో వచ్చే మార్పులు అన్ని ఈ విడియోలో ప్రస్పుటంగా వివరించారు. ఈ విడియోలో 99 మంది మహిళలు పాలు పంచుకున్నారు. మహిళలకు జరగుతున్న అన్యాయలను వెతిరేకిస్తూ మహిళ స్వేచ్ఛ గురించి సమాజంలోకి ఒక బలమైన మెసేజ్ వెళ్లేలా దీన్ని రూపొందించారు. ఈ దేశంలోని అందరు మహిళలకు, మహిళా శక్తికి దీన్ని అంకితం చేసారు.


మై చాయిస్ విడియోలో ఒక దృశ్యం


ఆ మధ్యకొందరు ప్రముఖులు, రాజకీయ నాయకులు మహిళలు వేసుకొనే వస్త్రాధరణపై పలు రకాలుగా విమర్శలు చేశారు. మహిళల వస్త్రధారణ వల్లే దేశంలో లైంగిక దాడులు జరుగుతున్నాయనే కొందరి వాదనకు ఈ వీడియో ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను ఎలా జీవించాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, నా శరీరం ఎలా ఉండాలన్నది పూర్తిగా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పెళ్లికి ముందు సెక్స్, పెళ్లి తర్వాత సెక్స్ అనేది పూర్తిగా నా ఇష్టం. నా వివాహం నాకు నచ్చినట్లు జరుగడమే కాదు..నా జీవితాన్ని పురుషుడితో పంచుకోవాలా? లేక స్త్రీతో పంచుకోవాలనేది కూడా పూర్తిగా నా ఇష్టం.. ఈ విధంగా దీపికా పదుకొనే విడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: