కొంత కాలంగా సూపర్ హిట్ లేక యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాధలో ఉన్నపుడు పూరీ దర్శకత్వంలో టెంపర్ రూపంలో సూపర్ డూపర్ హిట్ అందించాడు. దీంతో మనడు మహాఆనందంలో మునగితెలుతున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ ని డిఫరెంట్ మోడ్ లో చూపించాడు. నెగిటీవ్ షేడ్ లో చూపించాడు, సెంటిమెంట్ , యక్షన్, స్టయిలిష్, సిక్స్ ప్యాక్ తో అన్ని రకాలుగా ఎన్టీఆర్ ని చాలా చాలా అందంగా చూపించాడు. దీంతో ఎన్టీఆర్ ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. మనోడు ఓ పాటలో సిక్స్ ప్యాక్ తో చూస్తుంటే అసలు ఎన్టీఆర్ ఇలా కూడా ఉంటాడా అనిపించింది. ఇదే పూరి జగన్నాథ్ సినిమా ఆంద్రవాలా ఎన్టీఆర్ , టెంపర్ ఎన్టీఆర్ కి ఎంత తేడా బాబోయ్ అనిపించేలా తయారయ్యాడు.


టెంపర్ మూవీలో సిక్స్ ప్యాక్స్ తో ఎన్టీఆర్


మరి మనోడు ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఫ్రీప్రొడెక్షన్ పనుల కూడా వేగంగా సాగుతున్నాయి. మరి సుకుమార్ కూడా ఎన్టీఆర్ ని మనోడు ఏవిధంగా చూపిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ కూడా ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. దీనికోసం ప్రత్యేకమైన లుక్ ను డిజైన్ చేశారట. కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. బాడీ లాంగ్వేజ్ కూడా మార్చాల్సిందిగా ఎన్టీఆర్ ని కోరాడట. అంతే కాదు చైన్యా, బ్యాంకాక్ ల నుంచి క్యాస్ట్యూమ్స్ ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ఇదంతా ఎన్టీఆర్ ఫ్రెజ్ నెస్ కోసం అంటూన్నాడట సుకుమార్.

ఏప్రిల్ 10 నుంచి బార్సిలోనా లో రికార్డింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిసింది. 15న లండన్ లో షూటింగ్ మొదలవుతుంది. 2016 సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నారట. మరి ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో చూపిస్తారో..


మరింత సమాచారం తెలుసుకోండి: