దేశంలో మహిళల పట్ల సాగుతున్నఅత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మగాళ్ల పట్ల ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంత జాగ్రత్త పడిన..ఎంత శిక్షంచిన ఆడవారి ఫై ఆత్య చారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవలోకి సామన్య స్త్రీలే కాదు సెలబ్రెటీలు, సినిమా వాళ్లు కూడా బలిఅవుతున్నారు.
తాజాగా
తమిళనాడులో నటి మురుగేశ్వరిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేయడమే కాకుండా ఆమె ఒంటి ఫై
ఉన్న బట్టలు కూడా చింపేశారు. అనుకోకుండా తనపై జరుగుతున్న అఘాయిత్యానికి స్పందించి
ఆమె వారిని ఎదిరించింది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల ఉన్నావారు
వెంటనే స్పందించి అటుగా రావడంతో ఆ ప్రదేశం నుంచి దుండగులు పరారయ్యారు. ‘నాన్
కడవుల్’ అనే సినిమాలో నటి పూజకు మురుగేశ్వరి
స్నేహితురాలిగా నటించింది. తమిళనాడులోని వత్సలగుండు నుండి దేవదాన పట్టి
ప్రాంతానికి మురుగేశ్వరి వచ్చింది. బస్టాప్ నుంచి ఇంటికి వెళ్తుండగా అదే
ప్రాంతానికి చెందిన చిన్నపాండి, తంగపాండి అనే ఇద్దరు యువకులు ఆమె ఫై దాడి చేశారు.