149 సినిమాలు నటించిన చిరంజీవి హీరోయిన్స్ తో  ముద్దు సీన్స్ లో నటించే విషయంలో ఫెయిల్ అయ్యాడు అంటే ఎవ్వరూ నమ్మరు. అయితే ఈవిషయం నిజం అంటోంది ఒక టాప్ హీరోయిన్. 1990 ప్రాంతంలో గ్లామర్ హీరోయిన్ గా టాలీవుడ్ ను షేక్ చేసిన నగ్మా ఈ కామెంట్స్ చేసింది. 

మొన్న బుల్లితెరపై ప్రసారం అయిన రాఘవేంద్రరావు  సౌందర్య లహరి కార్యక్రమంలో పాల్గొన్న నగ్మా ఈ కామెంట్స్ చేసింది. తాను రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఘరానామొగుడు’ సినిమాలో నటిస్తున్నప్పుడు చిరంజీవితో ఒక ముద్దు సన్నివేశాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు ప్లాన్ చేసారు అని చెపుతూ అప్పటికే తాను బాలీవుడ్ లో ఇటువంటి సన్నివేశాలు  చేసిన నేపధ్యంలో రాఘవేంద్రరావు చిరంజీవితో ఒక ముద్దు సన్నివేశాన్ని హాట్ గా తీయడానికి ప్రయత్నించాడట. 
 
అయితే అప్పటికే ముద్దు సీన్లు చేసి ఆరితేరిన నగ్న బాగానే నటించినా చిరంజీవి మాత్రం ఆమె పెదాలను పర్ ఫెక్టుగా ముద్దాడలేక ఇబ్బంది పడ్డాట. ఆ సీన్ రాఘవేంద్రరావు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరిగ్గా రాకపోవడంతో ఆ సినిమా  ఫైనల్ వెర్షన్ ఎడిటింగులో ఆ ముద్దు సీన్ కట్ చేసారట. ఈ విషయాలన్నీ మొన్న ప్రసారం అయిన రాఘవేంద్రరావు సౌందర్య లహరి కార్యక్రమంలో బయట పడ్డాయి.

ఇదే సందర్భంలో నగ్మా తాను నటించిన సీనియర్ హీరోలకు ట్యాగ్ లైన్స్ ఇస్తూ కామెంట్లు చేసింది. మోహన్ బాబును ఫన్నీ మేన్ అంటూ బాలయ్యను  కృష్ణుడు అనీ చిరంజీవిని మంచి వాడని కామెంట్ చేసింది నగ్మా. అదేవిధంగా వెంకటేష్ ను సెంటిమెంటల్ మ్యాన్ అని, నాగార్జునను  మంచి ఫ్రెండ్ అంటూ వాళ్లకు బిరుదులు ఇచ్చింది నగ్మా. ఏమైనా మెగా స్టార్ చిరంజీవికి ముద్దు సీన్స్ లో నటించడం రాదు అని చెప్పడం నగ్మా చేసిన సాహసం అని అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: