మిల్కీ బ్యూటీ  తమన్నాకు మళ్ళీ దశ తిరిగి నట్టుగా కనిపిస్తోంది. ఈ  మధ్య కాలంలో ఆమెకు అనుకోకుండా  పెద్ద సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా నాగార్జున కార్తి లు నటిస్తున్న మల్టీ స్టారర్ లో అనుకోని అవకాశం కొట్టేసిన తమన్నా జీ తెలుగు ఛానల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయంది. అంతేకాదు జీ తెలుగు ఛానల్ కోసం తమన్నా కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు చేస్తుందట.

తాను  సినిమా రంగంలో అడుగు పెట్టి 10  సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఇటువంటి ప్రముఖ ఛానల్ కు బ్రాండ్  అంబాసిడర్ గా ఎంపిక కాబడటం తన అదృష్టం అంటోంది. ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడిన  తమన్నా తానూ నటిస్తున్న ‘బాహుబలి’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 

ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులు ఎవ్వరికీ  ఆ సినిమా కథ ఏమిటో పూర్త గా తెలియదని కేవలం తాము నటిస్తున్న పాత్రల వరకే రాజమౌళి క్లారిటీ ఇస్తున్నాడని వివరణ ఇచ్చింది. అంతేకాదు  ‘బాహుబలి’  సినిమా కథ ఏమిటో ఆ సినిమాలో  ప్రధాన తారగణానికి కూడ  తెలియదని కామెంట్ చేసింది. 

అందువల్ల ‘బాహుబలి’ లో  చాలా మంది నటిస్తున్నా నటించే వారికి ఏమీ అర్థంకాదు అని అనడమే కాకుండా ఈసినిమా కథ గురించి  తెలుసుకోవాలని  ప్రయత్నించినా తానూ  రాజమౌళి తెవితేటల ముందు ఓడిపోయాను  అని కామెంట్ చేసింది. తన సినిమాలో  నటిస్తున్న నటీనటులకు కూడ అర్ధం కానంత స్థాయిలో  ఈసినిమాను  రాజమౌళి  తీస్తున్నాడు అంటే రాజమౌళి ఈసినిమా విషయాలు లీక్ కాకుండా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: