సర్వసాధారణంగా టాప్ హీరోల సినిమాలు తమ విడుదల తేదీకి మూడు, నాలుగు రోజులకు ముందుగా సెన్సార్ అవుతూ ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా విడుదల  తేదీకి 10 రోజుల  ముందు అల్లుఆర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా దీని వెనుక  ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. 

బన్నీ సత్యమూర్తి సినిమాను  అమెరికాతో పాటుగా లండన్,  ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్  దేశాలతో పాటు మరికొన్ని దేశాలలో విడుదల చేయాలని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ లో మంచి క్రేజ్ రావడంతో ఈసినిమా టాక్ తో సంబంధం లేకుండా ప్రీమియర్ షోల ద్వారా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవడానికి అమెరికాలోని అనేక ప్రాంతాలలో ఈ సినిమా ప్రీమియర్  షోలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 ఈ వ్యవహారాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలి అంటే సెన్సార్ కార్యక్రమాలను ముందుగా ముగించుకుని  ఈ విషయాన్ని  ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు తెలియచేస్తే వారు ఎక్కువ స్థాయిలో ధియేటర్స్  స్క్రీన్స్ బుక్ చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సెన్సార్ కార్యక్రమాలను చాల ముందుగా ముగించారు అని టాక్. 

ఓవర్సీస్ మార్కెట్ కు సంబంధించి పవన్ ‘అత్తారింటికి దారేది’, మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాల పైన భారీ రికార్డులు ఉండటంతో  ఈ  సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ లో వస్తున్న క్రేజ్ రీత్యా పవన్, మహేష్ ల రికార్డులను  బ్రేక్  చేయడానికి చాల పక్కా ప్లాన్ తో ఈ సినిమాను అమెరికాలో విడుదల చేస్తున్నారు అనే వార్తలు హల్ చల్  చేస్తున్నాయి. నిన్న ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఎటువంటి  కట్స్ లేకుండా U/A  సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా ఈమధ్య కాలంలో తాము చూసిన మంచి సినిమా  అంటూ సెన్సార్ సభ్యులు త్రివిక్రమ్ ను  తెగ పొగడ్తలతో ముంచెత్తివేసారని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: