ఒకప్పుడు రాక్ ప్రపంచాన్ని కుదిపేసిన ‘రోలింగ్ స్టోన్’ బ్యాండ్ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ సింగర్ మిక్ జాగర్‌కు 71 ఏళ్లు. ప్రముఖ వర్ధమాన డాన్సర్ మెలానిక్ హామ్రీకి 27 ఏళ్లు. ఇద్దరి మధ్య కొనసాగుతున్న ప్రేమాయణం ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్.

మిక్ జాగర్‌-మెలానిక్ హామ్రీ


వారు ఎక్కడికెళ్లినా టాబ్లాయిడ్ పత్రికలు మొదలుకొని అన్ని ఎంటరేన్‌మెంట్ పత్రికల జర్నలిస్టులు వెంటబడతారు. వారు తమ మధ్యన కొనసాగుతున్న ప్రణయ విలాసాల గురించి ఏం మాట్లాడరు. అయినా వారి ఫొటోలు దొరికిదే అదే భాగ్యమనుకొని సంబరపడిపోతారు పాత్రికేయులు. న్యూయార్క్‌లోని మన్‌హటన్ ప్రాంతంలోని ఓ విలాసవంతమైన హోటల్ నుంచి వారిద్దరు బయటకొస్తు ఇటీవల కెమేరాలకు దొరికిపోయారు. సరిగ్గా ఏడాది క్రితం 2014, మార్చి నెలలో మిక్ జాగర్ భార్య ఎల్‌రెన్ స్కాట్ ఆత్మహత్య చేసుకున్న అనంతరం వారిద్దరు ఒకే చోట కనిపించడం ఇదే మొదటిసారి.

ఆమె ఆత్మహత్యకు కారణం మిక్ జాగర్, హామ్రీ ప్రణయ కలాపాలే కారణమని అప్పట్లో పత్రికలన్నీ కోైడె కూశాయి. వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను ప్రచురించి, ‘ఇప్పుడే పడక గది నుంచి బడలికతో బాల్కనీలోకి వచ్చిన ఆది దంపతులు’ అనే వ్యాఖ్యానాలతో తమ ముచ్చట తీర్చుకున్నాయి. చూడటానికి చెలాకీగా కనిపించే 71 ఏళ్ల మిక్ మొఖం ముడతలతో వికారంగా కనిపిస్తుందని, మిసమిసలాడే వయస్సులో నిగనిగలాడే బుగ్గలతో అందానికే అందమైన హామ్రీ అతన్ని ఎలా ప్రేమించిందబ్బా ! అని ఇప్పటికీ ముక్కుమీద వేలేసుకునే వాళ్లున్నారు. వారిది ‘ప్లేటోనిక్ లవ్’ అంటూ నిర్వచనం చెప్పే తత్వవేత్తలూ ఉన్నారు ఎవరు ఎన్ని మాటలంటున్న, ఎన్ని కథలు ప్రచారం చేస్తున్న మిక్ భార్య సోదరుడైన ర్యాండీ బాంబ్రో మాత్రం నమ్మడు. తన బావగారు చాలా మంచి వారని, ఆయన తన సోదరి పట్ల ఎంతో ప్రేమతో మెలిగేవారని అంటారు. మిక్, హామ్రీలు మంచి మిత్రులు మాత్రమేనని, తన సోదరి ఆత్మహత్యకు వారి బంధానికి సంబంధం లేదని చెబుతున్నారు. ప్లేటోనిక్ లవ్‌కు తొలిసారి నిర్వచనం చెప్పిన ప్లేటో బతికుంటే వారి బంధం గురించి ఏమనేవారో?


మరింత సమాచారం తెలుసుకోండి: