‘లెజెండ్’ హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగు సినిమా రంగం పై ఇక్కడి నిర్మాతలు, హీరోల పై చేసిన సంచలన వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి  ఈరోజు ఒక  ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌంటర్ ఇచ్చాడు. రాధిక కామెంట్స్ తనను చాల ఆశ్చర్య పరిచాయని అంటూ టాలీవుడ్ లో హీరోయిన్స్ కు ఉన్నంత గౌరవం బాలీవుడ్ లో  ఉండనే ఉండదు అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా రాధిక ఆప్టే కోపానికి అసలు కారణం వివరించాడు సాయి కొర్రపాటి.


యంగ్ హీరోలు ఆమె పట్ల ఆసక్తి చూపించలేదని 


బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చిన  రాధిక ఆప్టే చాలామంది యంగ్ హీరోలతో నటించాలని ప్రయత్నించిందని, అయితే ఆమెకు ఇప్పటికే 30 సంవత్సరాల వయస్సు ఉండటంతో చాలామంది యంగ్ హీరోలు ఆమె పట్ల ఆసక్తి చూపించలేదని అసలు  విషయం  బయట పెట్టాడు కొర్రపాటి. రాధిక లుక్ రీత్యా ఆమె సాంప్రదాయ బద్ధమైన పాత్రలకు మాత్రమే సూట్ అవుతుందని  అంటూ ఆమె గ్లామర్ పాత్రలకు సరిపోదు అన్న అభిప్రాయంతో ఆమెకు టాలీవుడ్ దర్శక నిర్మాతలు  సీనియర్ హీరోల సినిమాలలో ప్రాముఖ్యత ఉన్న సెకండ్ హీరోయిన్ పాత్రలను ఆఫర్ చేస్తున్నారని ఈ విషయాలన్నీ రాధికకు తెలుసు అంటూ కామెంట్ చేసాడు సాయి కొర్రపాటి.


తాము కూడ రాధకను బాగా చూసుకున్నామని


తాను  బాలకృష్ణతో తీసిన ‘లెజెండ్’ సినిమాలో రాధిక ఆప్టేను సెట్స్  పై బాగా చూసుకోవడమే కాకుండా ‘లెజెండ్’ సినిమా పూర్తి అయ్యాక ఆమెకు ఒప్పుకున్నా మొత్తానికంటే ఎక్కువగానే ముట్ట చెప్పామని  తెలియచేసాడు ఈ నిర్మాత. అదేవిధంగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘లయన్’  సినిమా దర్శకుడు సత్యదేవ మీడియాతో మాట్లాడుతూ తాము కూడ రాధకను బాగా చూసుకున్నామని చెపుతున్నాడు. ఒక వైపు తాప్సీ లాంటి హీరోయిన్స్ టాలీవుడ్ నిర్మాతలు తమను దేవతలుగా చూస్తారు అని చెపుతూ ఉంటే రాధిక మాత్రం ఇలా  మీడియాకు ఎక్కి టాలీవుడ్ నిర్మాతల పరువు తీయడం ఏమి బాగాలేదు అని చాలామంది భావిస్తున్నట్లు టాక్..
 

మరింత సమాచారం తెలుసుకోండి: