టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెండితెర మీద, తెర వెనుక ఒకేలా ప్రవర్తించే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది మంచు ఫ్యామిలి గురించే. ఎందుకంటే మంచు ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోలు, హరోయిన్స్ అందరూ ఒకే మాటపై నిలబడే తత్వం ఉన్నవారని ఇండస్ట్రీలో క్లియర్ టాక్స్ వినిపిస్తుంటాయి.

ముక్కుసూటిగా వెళుతున్న వీరి తత్వమే ఒక్కోసారి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక కుటుంబ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే, వీరి మధ్య జరిగే కోలాహలం అంతా ఇంతా కాదు. మొత్తంగా మంచు ఫ్యామిలీ అంటేనే మూసి ఉన్న గుప్పెట లాంటిది. తాజాగా మంచు లక్ష్మీ చిన్న పాపాయిలా మారి ఆటాడుకుంటుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఆమెకి కూతురు పుట్టినదగ్గర నుంచి మరిత ఉషారుగా మారిపోయింది.

తాజాగా తన కుమార్తె విద్య నిర్వాణకు బొమ్మలు కొనటం కోసం చెన్నైలోని కిడ్స్ షాపింగ్ కి వెళ్లింది. అక్కడ ఉన్న ట్రాలీ స్మూత్ రన్ ఉందో లేదో చెక్ తనే చెక్ చేసింది. అలా మంచు లక్ష్మీ ట్రాలీని చెక్ చేస్తుండగా తన ఫీలింగ్గ్స్ ఒక్కసారిగా కిడ్స్ లా మారిపోయాయి. ఈ వీడియోని ఆమె సోదరుడు మంచు విష్ణు షూట్ చేసి అప్ లోడ్ చేసాడు.

ఇక్కడ షాపుల్లో ఆమె తన కుమార్తెకు, తన మేనకోడళ్లు విరియానా, అరియానాలకు షాపింగ్ చేసారు. మంచు మనోజ్ వివాహానికి ముందే ఈ షాపింగ్ చేసి తన పిల్లలను మొదట సంతోషపెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘దొంగాట'. ఈ సినిమాలో ఓ పాటలో తెలుగు స్టార్ హీరోలలో కొందరు స్టెప్పులు వేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: