అందరూ ఎంతో ఆ శక్తిగా ఎదురు చూస్తున్న ‘మా’ ఎన్నికల ఫలితాల పై విచారణను కోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల పోలింగ్ వీడియో క్యాసెట్లను పోలింగ్ అధికారులు సమర్పించకపోవడంతో ఈ  కేసును విచారిస్తున్న జడ్జి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు  వస్తున్నాయి. 

ఈరోజు ‘మా’ ఎన్నికల విషయమై కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే ఈరోజు సాయంత్రానికి మొన్న జరిగిన ‘మా’ సంస్థ ఎన్నికల రిజల్ట్ ప్రకటిస్తారని అందరు అనుకుంటున్న నేపధ్యంలో కోర్టు మరోసారి ఈ కేసు వాయిదా వేయడం  మా  సంస్థ సభ్యులకు నిరాశ కలిగించింది అనే వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా మొన్న జరిగిన ‘మా’ ఎన్నికల వీడియో క్యాసెట్లను ఈరోజు కోర్టుకు సమర్పించక పోవడం పై ‘మా’ సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు మురళీ మోహన్ సరైన శ్రద్ధ వహించక పోవడం పట్ల చాలామంది ‘మా’ సభ్యులు విమర్శిస్తున్నారని టాక్. ఏది  ఎలా ఉన్నా మరో వారం  రోజుల పాటు ‘మా’ ఎన్నికల గాసిప్పులకు మరోసారి అవకాశం కలిగించింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: