మెగస్టార్ చిరంజీవి వెండితెర సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. తెలుగు చిత్ర రంగంలో మహా వృక్షంలా ఎదిగిన మహోన్నత వ్యక్తి. కొంత కాలంగా సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయ రంగం వైపు వెళ్లారు. ఈ మధ్య మళ్లీ సినిమాలో నటించాలనే కొరిక కలగడం అది 150 వ చిత్రం కావడం దీనికి గురించి సోషల్ మీడియాల్ రక రకాలుగా వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం.  


మా ఎలక్షన్ లో అధ్యక్ష పదవికి పోటీగా నిలబడిన జయసుధ, రాజేంద్ర ప్రసాద్


ఈ మధ్య ‘మా’ మూవీ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో వేరే చెప్పనక్కర లేదు. మా అసోసియేషన్లో దాదాపు 702 మంది ఓటర్లు ఉండగా 394 మంది నటీ నటులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే సుమారు 300 మంది వరకు ఓటు వేయకుండా డుమ్మా కొట్టారు. 

ఈ ఓటింగ్ మునుపటి తో పోలిస్తే బాగానే జరిగిందని అంతా అంటున్నారు. మరి గెలుపు ఎవరిది అన్న విషయం త్వరలోనే తెలనుంది. ఇంత టెన్షన్ తో జరిగిన ఎన్నికలకు ప్రముఖ హీరోలు డుమ్మా కొట్టారని సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే .  డుమ్మా కొట్టిన వారిలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, రాంచచరణ్. అలాగే అక్కినేని హీరోలు రాణా తదితర పెద్ద హీరోలు డుమ్మా కొట్టారు. మరి వీరు డుమ్మా కొట్టడానికి కారణం లేకపోలేదు. 


మెగాస్టార్ చిరంజీవి


ముఖ్యంగా చిరంజీవి చాలా కాలం నుంచి రాజకీయ పరంగా, సినీ పరంగా వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నే అన్ని విషయాల్లో బ్యాలెన్స్ గా ఉంటున్నారు. మరి పోటీ చేస్తున్న ఇద్దరు తనకు చాలా కావాల్సిన వారే అక్కడకు వెళితే మీడియా చేసే హంగామా ఎలా ఉంటుందో ముందుగానే ఊహించిన ఆయన తా నొవ్వక అవతల వారి మనసు నొప్పించక అన్నట్టు ఒటింగ్ కి దూరంగా ఉన్నారు. ఎవరు గెలిచినా తన వారే గెలిచినట్లు లెక్క అనేది ఆయన ఉద్దేశమట. 



మరింత సమాచారం తెలుసుకోండి: