క్రియేటివ్ దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన ‘అవును 2’ ఈవారంలో విడుదల కాబోతోంది. ఇప్పటికే  మంచి అంచనాలను సొంతం చేసుకున్న ఈ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’  విడుదల అయ్యేదాకా ఒక వారo రోజులు ఇరు రాష్ట్రాలలోను కలెక్షన్స్ హంగామా సృష్టిస్తుంది అన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రవిబాబు ప్రవేశ పెట్టిన ఒక కొత్త పద్ధతి చాల ఆశ్చర్య కరంగా మారింది. 

ప్రస్తుతం  హాలీవుడ్ సినిమాలు అన్నీ ఈ పద్ధతిలోనే నిర్మిస్తున్నారు.  రవిబాబు ‘అవును 2’ నిర్మాణంలో చాలామంది ప్రముఖ డైరెక్టర్స్ లా స్క్రిప్ట్ ఫైల్స్ ను పుచ్చుకుని షూటింగ్ స్పాట్ లో హడావిడి చేయలేదట. కనీసం ఒక్కసారి కూడా పెన్ వాడలేదట.  నటీనటులు అంతా వారి ఐప్యాడ్ లో స్క్రిప్ట్  ను డౌన్ లోడ్  చేసుకుని ఆ డైలాగ్స్ చదువుకుని నటించమని రవిబాబు తన నటీనటులకు సలహాలు ఇవ్వడమే కాకుండా అందరిచేత అదే  పద్ధతిని అవలభించేలా చేసాడని టాక్. 

అయితే రవిబాబు ప్రవేశ పెట్టిన ఈ కొత్త పద్దతితో మొదట్లో ఈ  సినిమాలో నటించిన నటీనటులు అంతా ఇబ్బందికి గురైనా తరువాత ఈ పద్ధతికి అలవాటుపడి రవిబాబును ఈ సినిమా సెట్లో టెక్ బాబా అంటూ ముద్దుగా పిలవడం మొదలు పెట్టారట.

ఈమధ్యకాలంలో రవిబాబు తీస్తున్న సినిమాలు చాల పరాజయం చెందడంతో ‘అవును 2’ విజయం పై రవిబాబు భవిష్యత్ కెరియర్ ఆధారపడి ఉంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.  హీరోయిన్  పూర్ణ ఈ  సినిమా లో  కొన్ని సన్నివేశాలలో చాలా హాట్  గా  కనిపిస్తుంది అన్న ప్రచారం జరుగుతూ  ఉండటంతో పూర్ణ  గ్లామర్ ఈ సినిమా  విజయానికి ఎంత  వరకు కలిసి వస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: