మా (మూవీ అసోసియేషన్ ) పెట్టినప్పటి నుంచి అద్యక్షపదవి యూనానిమస్ గా జరుతూ వస్తుంది. ఈ అధ్యక్ష పదవి టాలీవుడ్ అగ్రహీరోలు కూడా వహించారు.   కానీ ఈ సారిమ మటుకు మా ఎన్నికల్లో పూర్తి విరుద్దంగా జరిగింది. పోటీలు, రాజకీయాలు, విమర్శలు, కోర్టు కేసు దాకా పోయింది. ఎట్టకేలకు ఎన్నికలైతే జారిగాయి కానీ ఈ ఎలక్షన్స్ పై చాలా మందికి విముఖత ఏర్పడింది.


మా ఎలక్షన్స్ పోటీలో రాజేంద్ర ప్రసాద్, జయసుధ


ఈ ఉత్కంఠ ఎన్నికల ఫలితాలు మరో వారం ఆగాల్సిన అవసరం ఉంది. మా ఎలక్షన్స్ రాజకీయ రంగు పులమడంతో మా సభ్యుడు ఒ.కళ్యాన్ ఎన్నికల వ్యవహారంపై కోర్టుకెక్కడంతో ఆదివారం నాడు ఎన్నికలైతే జరిగాయి కానీ ఫలితాలు మటుకు వెల్లడి కాలేదు. ఐతే ఈ రోజు కూడా ఫలితాల వెల్లడికి కోర్టు సుముఖత చూపలేదు. కేసు విచారణ ఈ నెల 7కు వాయిదా పడింది. దీంతో ఫలితాలు కూడా ఆరోజే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఎలక్షన్స్ అనంతరం పోటీలు ఉన్న జయసుధ, రాజేంద్ర ప్రసాద్,మురళీ మోహన్ తదితరులు


గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మా ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా మారింది. పన్నేండేళ్లుగా అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్ ఈసారి ఎన్నికలకు దూరం కావడం తర్వాత రేసులో రాజేంద్ర ప్రసాద్ రావడం ఆయనకు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు సపోర్టు చేయడం. అంతలోనే జయసుధ తెరమీదకు రావడం ఈమెకు దాసరినారాయణరావు, మురళీ మోహన్ మద్దుతు ఇవ్వడంతో ఎలక్షన్స్ పోటా పోటీ ఏర్పడింది. మొత్తం 702 మంది ఓటర్స్ ఉండగా 394 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.        


మరింత సమాచారం తెలుసుకోండి: