నాగార్జున శివ సినిమా తర్వాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలుసు. నాగార్జున, అమలది చక్కటి జోడీ. వీరి ముద్దుల కొడుకే నిఖిల్. అయితే అమల పెళ్లి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా స్లిమ్ గా ఉంటూ శరీరంలో ఎలాంటి మార్పులు లేకుండా చూడ్డానికి చాలా పీస్ ఫేల్ గా కనిపిస్తుంది. ఆమె వయసు పెరిగినా ఇప్పటికీ శరీరాకృతిలో ఎలాంటి మార్పులు లేకుండా  చాలా జాగ్రత్తలు తీసకుంటుంది. మరి ఆ ఆందాం వెనుక ఉన్న రహస్యం ఏమిటా అంటే ఆమె వెగన్.. అంటే మాంసాహారం, పాలకు సంబంధించినవి ఏవీ తీసుకోకుండా ఉండటం అన్నమాట. అమల గత కొన్నేళ్లుగా ఈ విధానాన్ని కఠినంగా పాటిస్తుంది. అంతే కాదు ఈ మధ్య అమలు కొత్త మెరుపుతో చాలా ఆకర్షనగా తయారైందట. దీనికి కారణం నాగార్జున స్వయంగా బయట పెట్టాడు.


తమ ఇద్దరు పిల్లలు నాగ చైతన్య, అక్కినేని నిఖిల్ నాగార్జున, అమల


యోగా చేసేవాళ్లకు బహుషా విపాసన యోగా గురించి తెలిసే ఉంటుంది. ఈ యోగా చేయడానికి అమల పది రోజులు యోగా సెంటర్ లో గడిపిందట. తర్వాత అమలు మోఖంలో గ్లో పెరిగిందట. పది రోజుల తర్వాత ఇంటికొచ్చిన అమల చాలా చాలా ప్రశాంతంగా కనిపించిందనీ, అది మెరుపు రూపంలో కనిపించిందనీ, ఏదో ఒక రోజు నేను కూడా అలా కనిపిస్తానని నాగ్ అన్నాడు.  దీంతో నాగార్జున కూడా   వీలు చేసుకుని   విపాసనా సెంటర్ కి వెళ్లి తన మేను ఛాయను కూడా మెరుపులు మెరిసేలా చేయోచ్చు అని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: