బాలీవుడ్ లో హాట్ హాట్ గా సంచలన తారగా పేరు తెచ్చుకున్న తారల్లో పూనం పాండే ఒకరు. ఒకప్పడు ఇండియా క్రికెట్ టీమ్ గెలిస్తే ప్లే గ్రౌండ్ లో న్యూడ్ గా నడిచి వస్తా అని  ఓపెన్ గా బంపర్ ఆఫర్ ఇచ్చి వివాదంలో చిక్కుకుంది. ఈ అమ్మడు సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. బాలీవుడ్ లో నషా సినిమాతో విపరీతమైన ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మతులు పోగొట్టింది. పూనమ్‌ పాండే తెలుగులో ‘మాలినీ అండ్‌ కో' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.  తెలుగులో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మనీషా ఫిలిమ్స్‌ సంస్థ చాలా కాలం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వీరు కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూనమ్‌ సరసన హీరోగా సమ్రాట్‌ చేస్తున్నారు.


పూనం పాండే హాట్ ఇమేజ్


ఈ సినిమా టెర్రరిజం నేపథ్యంలో రూపొందుతున్న రొమాంటిక్ సినిమా. ఈ సినిమాల పాటలతో పాటు నాలుగు సూపర్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. ‘‘మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన కిశోర్‌ రాఠీ కుమారుడు మిలన్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన ‘యమలీల'లో బాలనటుడిగా కనిపించారు. యువతను ఉర్రూతలూగించే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. ‘ఎవడు', ‘లెజెండ్‌' వంటి చిత్రాలకు పనిచేసిన సి. రాంప్రసాద్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు'' అని చెప్పారు. ఈ చిత్రంలో పూనం పాండే అందాలతో పాటు సూపర స్టంట్స్ చేసిందట . ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సినిమా నుంచి ఓ హాట్ సాంగ్ ని వదిలారు. పూనం ఈ పాటలో   రకరకాల మసాజుల గురించి చెప్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: