ప్రేక్షకులకు ‘హార్ట్ ఎటాక్’ తెప్పించడానికి ప్రయత్నించి అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయిన పూరి నితిన్ ల కాంబినేషన్ లో మరో  సినిమా పట్టాలు ఎక్కుతున్న సంగతి ఒక  ఆశ్చర్యం అయితే ఆ సినిమాకు ఎంచుకున్న టైటిల్ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక విభిన్నమైన టైటిల్ తో ఈ సినిమా ఉండాలి అన్న ఆలోచనలతో పూరి  నితిన్  తో తాను తీయబోయే సినిమాకు ‘మా అమ్మ సీతామహాలక్ష్మి’ అన్న  టైటిల్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

నితిన్ ఈమధ్య నటించిన ‘చిన్నదాన నీకోసం’ సినిమా పరాజయం చెందడంతో రకరకాల కథలు విన్న  తరువాత నితిన్ పూరి చెప్పిన ఈ కథను అదేవిధంగా ఈ టైటిల్ ను ఓకే చేసాడు అని టాక్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా కథ పూరి గతంలో రవితేజా తో తీసిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ కథను పోలి ఉంటుందని టాక్.

అంతేకాదు ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ లో నటించిన ప్రకాష్ రాజ్, జయసుధలు మళ్ళీ నితిన్ తో కలిసి ‘మా అమ్మ సీతామహాలక్ష్మి’ లో నటిస్తూ ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వేగంగా సినిమాలు తీసే పూరి ప్రస్తుతం ఛార్మితో తీస్తున్న ‘జ్యోతిలక్ష్మి’ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని అంటున్నారు. రవితేజా సినిమాతో పూరి నితిన్ పై చేస్తున్న ప్రయోగం ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: