ఏప్రియల్ 9న విడుదల కాబోతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ స్పీడ్ ను పెంచాడు త్రివిక్రమ్. నిన్న విజయవాడలో ఈ సినిమా ఆడియో సక్సస్ మీట్ ను చాల హడావిడిగా నిర్వహించాడు. ఒక వైపు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న మాటలు వినిపిస్తున్నా ఈ సినిమా రైట్స్ భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు అదేవిధంగా అల్లుఅర్జున్ అభిమానులకు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా సెకండ్ ఆఫ్ కు సంబంధించి బయటకు వస్తున్న వార్తలు టెన్షన్ పెడుతున్నాయి అని టాక్. 

ఫిలింనగర్ లో వినిపిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ టాక్ ను బట్టి ఈసినిమా సెకండాఫ్‌లో కాస్తంత నత్తనడక ఉంటుందట. అయితే త్రివిక్రమ్‌ మార్కు పంచ్‌ లు ఉన్నా ద్వితీయార్థంలో వచ్చే ఒడిదుడుకులు ఈ చిత్రం రేంజ్‌ని డిసైడ్‌ చేస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎమోషనల్‌ క్లయిమాక్స్‌తో చివరి అరగంట ఈ సినిమాకు హైలెట్ గా మారడంతో అప్పటి వరకు  బోర్ ఫీలైన ప్రేక్షకులు సత్యమూర్తి క్లైమాక్స్ లో లీనమైపోతారని టాక్.  

అయితే త్రివిక్రమ్ కు గతంలో విజయాలతో పాటు ‘ఖలేజ’ లాంటి భారీ ఫ్లాప్ లు కూడా ఉండటంతో సత్యమూర్తి ఎటువంటి రిజల్ట్ ను ఇస్తుంది అనే భయం ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లతో పాటు బన్నీ అభిమానులను కూడా తీవ్రంగా బాధ పెడుతోంది అని టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: