నందమూరి సింహం బాలకృష్ణ మంచి నటుడుగానే కాదు మంచి వాస్తు జ్యోతిష్య సిద్దాంతిగా మారి తన దగ్గరకు వచ్చే దర్శకులకు వారికి కలిసి వచ్చే  విధంగా పేర్లు మారుస్తున్నాడు. బాలకృష్ణ తో ప్రస్తుతం ‘లయన్’ సినిమాను తీస్తున్న సత్యదేవ్ ఎంతో మంది హీరోల చుట్టూ నిర్మాతల చుట్టూ తిరిగినా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు.

అయితే సత్యదేవ్ ముఖం చూడగానే బాలకృష్ణకు ఈ నూతన  దర్శకుడు విపరీతంగా నచ్చి వెంటనే డేట్స్ ఇచ్చేసాడు. అంతేకాదు ఈ దర్శకుడు పేరు కూడా మార్చేసాడట. సత్యదేవ్ అసలు పేరు సత్యనారాయణ. అయితే ఈ పేరు కంటే అతడి పేరును సత్యదేవ్ అని మార్చుకుంటే కలిసి వస్తుందని చెప్పి బాలయ్య ఈ దర్శకుడికి తానే స్వయంగా పేరు పెట్టాడని టాక్. 

తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు బాలకృష్ణ స్వయంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు సంబంధించి వాస్తు మార్పులు చేసిన తరువాత  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా బాలకృష్ణ తాను సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘లయన్’ సినిమాను ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే నాడు విడుదల చేద్దామని నిర్మాతలు భావిస్తే  బాలకృష్ణ ఈ సినిమా విడుదలను ఒకరోజు ముందుకు జరిపి ఈనెల 30న విడుదల చేయడానికి ఈ జ్యోతిష్య నమ్మకాలే కారణం అన్న వార్తలు కూడ ఉన్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: