సన్నీలియోన్ ఫోటోలు చూడకుండా నేటి యువతరం ఎలా ఉండలేకపోతోందో ఆమె గురించి వార్తలు లేకుండా మీడియా ఉండదు. తనకు గాడ్ ఫాదర్స్ అంటూ  ఎవరూ లేరని తన సినిమాలకు సంబంధించి తనకు తానే గాడ్ ఫాదర్ అంటూ కామెంట్స్ చేసింది సన్నీలియోన్. తన కెరియర్ పై ఎవరి జోక్యం తాను సహించనని  అయితే  తనకు ఏ సందేహం వచ్చినా తన భర్త డేనియల్ తో చర్చిస్తానని కామెంట్స్ చేసింది సన్నీ. 

ప్రస్తుతం ఈమె నటిస్తున్న  ‘ఏక్ పహేలీ లీల’ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పునర్జన్మల నేపధ్యంలో ఈ  సినిమా ఉంటుందని ఈ సినిమా స్టోరీ లైన్ మీడియాకు తెలియచేసింది.  అయితే ఆ మీడియా సమావేశంలో పాల్గొన్న ఓ  వ్యక్తి మళ్ళీ జన్మలో మీరు ఎలా పుట్టాలి అనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు సన్నీ షాకింగ్ రిప్లై ఇచ్చింది.  

తనకు వచ్చే జన్మ అనేది ఉంటే తాను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లా పుట్టాలని కోరుకుంటున్నానని సమాధానం  ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచింది. దీనికి కారణం సల్మాన్ అంటే ఎంతమంది భయపడతారో అంతకన్నా ఎక్కువగా సల్మాన్ ను చాలామంది ప్రేమిస్తారని అంటూ మనిషి అంటే సల్మాన్ లా  ఉండాలి ఆంటూ పొగడ్తలతో ముంచెత్తి వేసింది. దీనితో సన్నీ దృష్టి సల్మాన్ పై పడింది ఏమిటి అని మీడియా వర్గాలు ఆశ్చర్య పడినట్లు టాక్



మరింత సమాచారం తెలుసుకోండి: